Kaizer News

అధికార మదంతో హరీశ్‌రావుపై నిందలు తగవు

అధికార మదంతో హరీశ్‌రావుపై నిందలు తగవు

· State - Telangana · ntnews.com

మంత్రి పొంగులేటి భూదందాలు బయటపెడ్తాం బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోసుల శ్రీనివాస్‌ ఫైర్‌ హైదరాబాద్‌, ఆగస్టు 30, (నమస్తే తెలంగాణ) : రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికార మదంతో నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారుడు హరీశ్‌రావుపై నిం దలు వేయడం తగదని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోసుల శ్రీనివాస్‌యాదవ్‌ ధ్వజమెత్తారు. ఈ మేర కు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పొంగులేటి షాడో సీఎం గా వ్యవహరిస్తూ ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు. రెవె న్యూ అధికారులను అడ్డుపెట్టుకొని రాఘవ సంస్థతోపాటు దాని బినా మీ కంపెనీలకు భూములు కట్టబెట్టారని, రాత్రికి రాత్రే 22ఏ పరిధిలోకి లక్షల ఎకరాలను చేర్చారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భూములను కొల్లగొట్టడమే లక్ష్యం గా రేసు గుర్రాల్లా పోటీ పడుతున్నారని విమర్శించారు. వారి భూ దోపిడీ చిట్టాను సిద్ధం చేశామని, త్వరలోనే ప్రజల ముందు ఉంచుతామని స్పష్టంచేశారు. అంతకు ముందే వారి మంత్రివర్గ సహచరురాలు కొండా సురేఖ కుటుంబమే వారి బండారాన్ని బయటపెట్టనున్నదని సంచలన వ్యాఖ్యలు చేశా రు. తెలంగాణ ఉద్యమంలో ‘జై తెలంగాణ’ అని కూడా అనని పొంగులేటి, ఉద్యమ నేతలైన కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావుపై అహంకారపూరిత మాటలు మా ట్లాడితే తెలంగాణ సమాజం ఊరుకోదని, రాళ్లతో బుద్ధి చెప్తుందని హెచ్చరించారు. మంత్రిగా బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే రాబోయే రోజుల్లో ప్రజాకోర్టులో శిక్ష తప్పదని పేర్కొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News