Kaizer News

నూతన దంపతులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి పెళ్లి కానుక

నూతన దంపతులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి పెళ్లి కానుక

· State - Telangana · prabhanews.com

భవానిపురం, ఆంధ్రప్రభ: పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి తన నియోజకవర్గ పరిధిలో వివాహం చేసుకుంటున్న నూతన దంపతులకు ప్రత్యేకంగా ‘సుజనా పెళ్లి కానుక’ అందజేస్తూ అభినందనలు తెలుపుతున్నారు. వివాహ ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యేకు పంపిన కుటుంబాలకు చీర, వరుడికి ప్యాంటు-షర్టు, స్వీట్ల పెట్టెతో పాటు పసుపు, కుంకుమలను కానుకగా అందజేస్తున్నారు. 41వ డివిజన్ మసీద్ స్ట్రీట్‌కు చెందిన దివంగత అబ్దుల్ గఫార్, గౌసియా దంపతుల కుమార్తె అబ్దుల్ కౌసర్ వివాహం షేక్ అబుబకర్‌తో ఆదివారం మౌలానగర్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయం తరఫున సుజనా మిత్ర సమన్వయకర్తలు వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులకు ‘సుజనా పెళ్లి కానుక’ను అందజేశారు. కొత్త జంట సుఖసంతోషాలతో, ఆనందంగా జీవించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు

Original source: prabhanews.com
Read more on Kaizer News