Shorts విజయవాడ: విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని ఖాళీగా ఉన్న 57 ఎకరాల డిస్నీలాండ్ భూములు, 20 ఎకరాల రైల్వే భూములు, 30 ఎకరాల చెత్త ఫ్యాక్టరీ స్థలాలు, మొత్తం 100 ఎకరాలకు పైగా భూములను పేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో నేడు డిస్నీల్యాండ్ వరకు పేదలు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు# డిస్నీ ల్యాండ్ లోకి పేదలు నినాదాలు చేసుకుంటూ ప్రవేశించి, జెండాలు పాతారు , పేదల ఆందోళనకు చిహ్నంగా వేసిన గుడిసె వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో బాబురావు, సిపిఎం నగర నేతలు బోయి సత్యబాబు, బి రమణ రావు, పి కృష్ణ తదితరులు ప్రసంగించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా పేదలకు ఇవ్వటానికి ఇళ్ల స్థలాలు లేవని చెప్పటం పచ్చి అబద్ధం. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండగా ముఖ్యమంత్రి ఇళ్ల స్థలాలు సిద్ధం చేయండి అని ఒక రోజు.. స్థలాలు లేవు.. కాబట్టి 15 అంతస్తుల టిడ్కో ఇళ్ళు నిర్మిస్తామని మరొక రోజు చెప్పటం మోసపూరితం. 9 సంవత్సరాల క్రితం జక్కంపూడి లో నిర్మించిన నాలుగు అంతస్తుల టిడ్కోఇళ్ళు ఇప్పటికీ పూర్తి కాలేదు, లబ్ధిదారులకు దక్కలేదు, పేదలు అప్పుల పాలయ్యారు, సదుపాయాలు కల్పించలేదు, నివాసయోగ్యంగా లేవు ఎన్నికలు రాకపోతే కూటమి సర్కారుకు చంద్రబాబుకు పేదల ఇళ్ల స్థలాలు, ఇళ్ళు గుర్తుకు రావా? కార్పొరేట్ కంపెనీలకు లక్షల ఎకరాలు స్థలాలు కేటాయించటానికి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తారా? పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి ల్యాండ్ బ్యాంక్ ఉండదా? తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ భూములు కేటాయించడానికి స్థలాలు దొరుకుతాయా? పేదలకు ఇవ్వటానికి మాత్రం స్థలాలు దొరకవా? అజిత్ సింగ్ నగర్ లో డిస్నీల్యాండ్ 57 ఎకరాల తో సహా, 100 ఎకరాలు ప్రభుత్వ భూములు నిరుపయోగంగా ఉన్నాయి, అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారుతున్నాయి. ఈ భూములను పేదలకు రెండు సెంట్లు ఇళ్ల స్థలాలుగా ఇవ్వటానికి ఆటంకం ఏమిటి? డిస్నీల్యాండ్ భూములను బడా కంపెనీలకు కట్టబెట్టడానికి కుట్ర జరుగుతోంది, ఇప్పటికే విజయవాడ తో సహా రాష్ట్రంలో పలు ప్రాంతాలలో లక్షల ఎకరాల భూములను కార్పొరేట్లకు కారు చౌకగా కట్టబెడుతున్నారు, ఎకరం భూమి 99 పైసలకే అప్పగిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఇళ్ల పేరుతో మళ్లీ మోసగిస్తే సహించేది లేదు, కాగితాలు వద్దు, స్థలాలు ఇవ్వండి, ఇళ్లు ఇవ్వండి. ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి డిస్నీ లాండ్, ఖాళీగా ఉన్న ఇతర భూములను పేదలకు కేటాయిస్తూ ఆదేశాలు ఇవ్వాలి. పేదల కొరకు నిర్మించిన జి ప్లస్ త్రీ భవనాల లోని రెండువేల ప్లాట్లకు పైగా.. గత పది ఏళ్ల నుండి వృధాగా పడి ఉన్నాయి, నేతలు వాటిని పంచుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు, పేదలకు మొండి చేయి చూపుతున్నారు. నగరంలో ఉన్న విలువైన స్థలాలను బడా సంస్థలకు అప్పగించి, పేదలను నగరానికి దూరంగా తరిమేస్తారా? ఇప్పటికే పాత బస్టాండ్ స్థలాన్ని లూలూ సంస్థకు, భవాని ఐలాండ్ మరో బడా కంపెనీకి, ఇంకా అనేక విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు పాలకులు కట్టబెడుతున్నారు. గత ప్రభుత్వం సుదూర ప్రాంతాలలో పేదలకు ఇచ్చిన స్థలాలు అత్యధిక భాగం ఎందుకు పనికిరావు, ఇళ్ల నిర్మాణాలు జరగలేదు, జరిగినచోట్ల నివాస యోగ్యంగా లేవు, ఈ ప్