Kaizer News

Guntur: ఘనంగా డీఆర్‌సీ సమావేశం - పలు అభివృద్ధి అంశ

Guntur: ఘనంగా డీఆర్‌సీ సమావేశం - పలు అభివృద్ధి అంశాలపై చర్చ

· State - Telangana · hmtvlive.com

Shorts గుంటూరు: గుంటూరు జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో పాల్గొన్న ఇంచార్జి మంత్రి కందుల దుర్గేష్, గుంటూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ ఎన్ శంకరన్ హాల్ లో డీఆర్సీ మీటింగ్, హాజరైన ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్,ఎమ్మెల్యేలు ధూళిపాళ్ళ నరేంద్ర, మాధవి, శ్రవణ్ కుమార్, కలెక్టర్ సాయి కాంత్ వర్మ,మునిసిపల్ కమిషనర్ మయూర్ అశోక్, జిల్లాలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు. ఎల్ నినో ప్రభావం, ఎరువుల కొరత,పంట మద్దతు ధర,నిత్యావసర వస్తు ధరలు, కౌలు రైతుల సమస్యలు,జల్ జీవన్ మిషన్ 2.0 పనులు, ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ లకు దరఖాస్తుల స్వీకరణ, సూపర్ సిక్స్ పథకాల అమలు తీరు తదితర పై కొనసాగిన చర్చ. 13,657 మంది రైతుల నుండి 91,178 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు, అత్యధికంగా పొన్నూరు లో ధాన్యం సేకరణ. దీపం పథకం క్రింద 5 దశల్లో 20,25,565 రూ. 168 కోట్ల లబ్ది. ఎరువుల లభ్యతపై మంత్రి దుర్గేష్ ఆరా.. బ్లాక్ మార్కెట్ పై నిఘా.. చర్యలకు మంత్రి దుర్గేష్ ఆదేశం. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎల్ నినో ప్రభావం ఉన్న ప్రాంతాల్లో త్రాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఆదేశం. అమరజీవి జలధార ప్రాజెక్టు రెండవ దశ పనులు జిల్లాలో శర వేగంగా జరుగుతున్నాయన్న అధికారులు 50,527 మంది నూతన పెన్షన్ కు దరఖాస్తు చేసుకున్నారని, 1081 మందికి అప్రూవ్ చేశామని అధికారులు వెల్లడి. రాబోయే రోజుల్లో పెన్షన్ ల దరఖాస్తు నిరంతర ప్రక్రియ.. అర్హులందరికీ పెన్షన్ లు ఇవ్వాలన్నది సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనగా పేర్కొన్న మంత్రి దుర్గేష్. కొత్త పెన్షన్ దరఖాస్తుల్లో హౌస్ హోల్డ్ సర్వే వల్ల ఎదురవుతోన్న ఇబ్బందులపై చర్చ..ఇప్పటికే సంబంధిత సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపిందని మంత్రి దుర్గేష్ వెల్లడి. గుంటూరు జిల్లా తెనాలి లో జనవరిలో నంది నాటకోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి దుర్గేష్ ప్రకటన, DRC సమావేశంలో జరిగిన చర్చలకు పరిష్కారం దిశగా అందరూ పని చేయాలని దిశానిర్దేశం.. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచన అంతకు ముందు జరిగిన జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్ష కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి దుర్గేష్, ప్రజా ప్రతినిధులు, అధికారులు

Original source: hmtvlive.com
Read more on Kaizer News