Kaizer News

Bhadrachalam: రూ.10,116 లకు గణపయ్య లడ్డూను దక్కించ

Bhadrachalam: రూ.10,116 లకు గణపయ్య లడ్డూను దక్కించుకున్న టౌన్ సీఐ!

· State - Telangana · hmtvlive.com

Shorts భద్రాచలం సెప్టెంబర్ 19: వినాయక చవితి పండుగ సందర్భంగా భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్లో ఐదు రోజులపాటు నవరాత్రుల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఐదు రోజులపాటు గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి చివరి రోజున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు భద్రాచలం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శివ నాయక్ గారు, డీఎస్పీ అరుణ్ కుమార్ ఈరోజు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. నేటితో ఈ ఉత్సవాలు ముగియడంతో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను చేశారు. కార్యక్రమంలో భాగంగా స్వామివారి లడ్డుని (అమృత ఫలం) పాటలో పట్టణ సీఐ నాగరాజ్ 10,116/- రూ లకు దక్కించుకున్నారు. విధి నిర్వహణలో నిరంతరం ఒత్తిడితో ఉండే పోలీస్ అన్న ఒక్కసారిగా చిన్నపిల్లల మారి చిందులు వేశారు. డప్పుల మోతలతో గణనాధుని ఘనంగా గంగమ్మ ఒడికి చేర్చారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం సీఐ నాగరాజు, ఎస్సైలు సతీష్, రామకృష్ణ, జి స్వప్న, చారి రాంబాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News