Kaizer News

చెన్నపురిలో తెలుగు వెలుగు.. తెలుగువారు ఎక్కడ ఉంటే

చెన్నపురిలో తెలుగు వెలుగు.. తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ సభ జరగాల్సిందే.

· National - India · tv9telugu.com

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెలుపల.. ఏ వీధిలోకి వెళ్లిన శ్రావ్యమైన తెలుగు వినిపించే నగరం ఏదైనా ఉందంటే అది చెన్నై అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగువారిచ్చిన స్థలంలో, తెలుగు ప్రముఖుల ఆశీస్సులతో అభివృద్ధి చెందినదే మద్రాసు మహానగరం. ఎందరో మహనీయులు నడయాడిన ఆ నేల ఇప్పటికి తెలుగు వారికి అత్యంత ప్రీతిప్రాతమైన ప్రదేశం. తెలుగుకు వెలుగునిచ్చిన చెన్నపురిని తన సాహితీ సేద్యానికి కార్యక్షేత్రంగా మార్చుకున్న బహుకొద్దిమందిలో గుడిమెట్ల చెన్నయ్య అగ్రగణ్యులని చెప్పేందుకు సందేహించకూడదు. ఆయన మాట తెలుగు, ఆయన ఆట తెలుగు, ఆయన శ్వాస తెలుగు.. తమిళనాడులోను తెలుగును బతికించేందుకు కంకణం కట్టుకుని రాత్రి పగలు అదే పనిమీద ఉన్న చెన్నయ్య పలువురు సాహితీప్రియులకు ఆదర్శ ప్రాయుడు అని అంగీకరించాల్సిందే. తెలుగు కోసమే పుట్టి, తెలుగు కోసమే ఎదిగి, తన 75 ఏళ్ల వయసులోనూ తెలుగు తెలుగు అంటూ కలవరించే ఏకైన సాహిత్యాభిమాని చెన్నయ్య. అసలు చెన్నై, చెన్నయ్య రెండు ఒకటే అన్నట్లుగా చెన్నపురిలో తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ ఒక సభ పెట్టి వారిని ప్రోత్సహించే భాషాభిమాని చెన్నయ్య… చెన్నయ్య, జనని సాంస్కృతిక సమితి.. ఒకే నాణెనికి రెండు వైపుల లాంటి వాళ్లు. చెన్నయ్య వస్తున్నారంటే జనని సాంస్కృతిక సమితి నడుచుకుంటూ వస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. చెన్నైలో తెలుగు భాషను ప్రోత్సహించేందుకే చెన్నయ్య.. జనని సంస్థను ప్రారంభించారు. వాట్సాప్, ఫేస్ బుక్ లేని రోజుల్లో, సోషల్ మీడియా అంటే ఏమిటో తెలియని టైములో ఎక్కే బస్సు, దిగే బస్సు అన్నట్లుగా తిరుగుతూ చెన్నయ్య సాహిత్య సభలకు ఏర్పాటు చేసేవారు. బడి పిల్లలకు తెలుగు భాషలో పోటీలు పెట్టి సొంత డబ్బులతో పురస్కారాలు ప్రదానం చేసేవారు. తమిళనాట తెలుగు బాలలు మాతృభాషను మరిచిపోకుండా చూడాలన్న ఏకైక ఆకాంక్షతో చెన్నయ్య అలుపెరుగుని యోధుడిలా పోరాడేవారు. ఏడు పదులు దాటిన వయసులో ఇప్పుడు కూడా చెన్నయ్య అదే ఊపు, అదే ఉత్సాహం, అదే సాహిత్యాభిమానంతో తెలుగు తల్లికి సేవచేస్తున్నారు. జనని సాంస్కృతిక సమితి తరపున ఏడాదికి కనీసం అరడజలు కార్యక్రమాలను నిర్వహిస్తూ.. తెలుగు ప్రజల్లో భాషా చైతన్యానికి ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు. తమిళనాడు ప్రభుత్వం తెలుగు పట్ల వివక్ష చూపుతూ సాధ్యమైనంత వరకు మైనార్టీ భాషలను నిరుత్సాహపరచాలని చూస్తున్నప్పటికీ.. చెన్నయ్య లాంటి వాళ్లు భాషను కాపాడేందుకు అహరహం కృషి చేస్తున్నారు… కవిగా, కథా రచయితగా, సరస భాషా చతురుడిగా, సాహిత్య సేవకుడిగా, విమర్శకుడిగా, ఉపన్యాసకుడిగా చెన్నయ్య బహుముఖ ప్రజ్ఞ 75 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉద్యోగం ఆయన వృత్తి అయితే, సాహిత్య సేవ ఆయన ప్రవృత్తిగా చెప్పుకోవాల్సిందే. రిటైరైన తర్వాత ఆయన వృత్తి, ప్రవృత్తి .. రెండు కూడా సాహిత్య సేవేనని అంగీకరించాల్సిందే. సింహపురి ఆయన జన్మభూమి, చెన్నపట్నం ఆయన స్థిరపడిన చోటు. గుడిమెట్ల చెన్నయ్య.. 1950లో పుట్టారు. అప్పటి మద్రాసు రాష్ట్రంలో భాగమైన తెలుగు ప్రాంతం నెల్లూరు జిల్లా కనిగిరి మండలం తమటంవారిపాలెం ఆయన జన్మస్థలం. గుడిమెట్ల చంద్రయ్య, గుడిమెట్ల కొండమ్మ దంపతుల సంతానంలో ఆయన ఒకరు. చెన్నయ్య విద్యాభ్యాసం మద్రాసులోనే జరిగింది

Original source: tv9telugu.com
Read more on Kaizer News