ముమ్మాటికి కుంటే.! Andhra Prabha Exclusive Story అల్లం వారి కుంటను సాధించుకోవడం కోసం ఆయకట్టు రైతులు రిలే నిరాహార దీక్షలకు సన్నద్ధమవుతున్నారు. “ఆంధ్రప్రభ”లో గత నెల రోజులుగా వరుసగా వచ్చిన కథనాలపై రాష్ట్ర ప్రభుత్వం,జిల్లా కలెక్టర్ స్పందించి, విచారణ జరిపి, నివేదిక సమర్పించాల్సిందిగా జన్నారం తాహసిల్దార్ ను ఆదేశించారు. దీంతో రెవెన్యూ,నీటిపారుదల శాఖ ఉమ్మడిగా గత నెల 28న నిర్వహించిన సర్వేలోని పూర్వపరాలను, రికార్డులను తాహసిల్దార్ సమగ్రంగా పరిశీలించి జిల్లా కలెక్టర్ కు నివేదిక పంపించారు. ఆ నివేదిక ఆధారాలను “ఆంధ్రప్రభ” సమాచార హక్కు చట్టం కింద సేకరించింది.ఆ నివేదిక ప్రకారం గతంలో మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని రేండ్లగూడ గ్రామానికి ఎం.డి జలాలోద్దీన్, ఎం.డి ఆఫీజోద్దీన్,ఎం.డి హబిబోద్దీన్ లు1954-55 గ్రామ రెవెన్యూ శివారు సర్వేనెంబరు160,161లో 24 ఎకరాల కుంట భూముల్లో పట్టాదారులుగా రెవెన్యూ పహాణీలలో నమోదు చేసి ఉంది. ఆ తర్వాత ఆ పట్టాదారులు ఆ భూమిని సీలింగ్ యాక్ట్ కింద ప్రభుత్వానికి అప్పగించారు.అదే భూమిని 1990-91లో డిక్రీని అదే గ్రామానికి చెందిన అల్లం,బాల్త, సుద్ధవేణి,ఇతర ఇంటి పేర్లు గల కొంతమంది భూస్వాములు సీలింగ్ అసైన్డ్ సి.సి.నం. సి/762 ద్వారా భూమిని పొందినట్లు రెవెన్యూ పహాణీలలో నమోదై ఉన్నట్లు పేర్కొన్నారు.ఆ నివేదికను ఈ నెల 9న జిల్లా కలెక్టర్ కు పంపించినట్లు స్థానిక తహసిల్దార్ బక్కయ్య తెలిపారు.ఈ పరిణామాల నేపథ్యంలో కొందరు హైకోర్టును ఆశ్రయించగా, వచ్చేనెల 29 వరకు తాత్కాలిక స్టే కోర్టు విధించినట్లు ఓ రెవెన్యూ అధికారి తెలిపారు.ఈ నేపథ్యంలో గ్రామ సామాజిక పోరాట సమితి నాయకుడు, రైతు సముద్రాల శంకర్, సీపీఐ మండల కన్వీనర్ దాసరి తిరుపతి గ్రామ రైతులు బాల్త సుధాకర్, సత్తన్న,అల్లం సురేష్, గిరివర్మ,ఆకుల మధు, సత్యవ్వ,వేయికండ్ల రవి,సంధ్యవేణి పవన్ యాదవ్,తదిత రైతులు తాహసిల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలకు సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ వ్యవహార నివేదిక (బంతి) జిల్లా కలెక్టర్ చేతి (కోర్టు)లో ఉంది.ఈ మేరకు నిర్ణయం కోసం వేచి చూడాల్సిందే