తరగతి గదిలో పిల్లలకు పాఠాలు చెప్పినా, కలం పట్టి కమ్మని పద్యాలు రాసినా, సభా వేదికపై శ్రావ్యమైన కంఠస్వరంతో కవితాగానం చేసినా, చిత్ర విచిత్ర వర్ణాలతో ఆకర్షణీయమైన బొమ్మలు గీసినా, ఉలితో కఠినమైన శిలలను అందమైన శిల్పాలుగా చెక్కినా, అద్భుతమైన నటనా కౌశలంతో రంగస్థలాన్ని ఉర్రూతలూగించినా, ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు చేసినా ఆయనకు ఆయనే సాటి. ఇలాంటి విభిన్న ప్రక్రియల్లో తనదైన ప్రత్యేక ముద్రను పదిలపరచుకున్న మహనీయుడు కవిరాజు నంబి శ్రీధర్‌రావు