Kaizer News

అభిషేక్‌ శర్మ తుపాన్‌ ఇన్నింగ్స్‌.. కేవలం 26 బంతుల

అభిషేక్‌ శర్మ తుపాన్‌ ఇన్నింగ్స్‌.. కేవలం 26 బంతుల్లోనే

· Sports · sakshi.com

షేర్-ఎ-పంజాబ్ T20 లీగ్ 2026 సీజన్‌ను అభిషేక్‌ శర్మ సారథ్యంలోని అమృత్‌సర్ సూర్మాస్ ఓటమితో ఆరంభించింది. ఆదివారం మొహాలీ వేదికగా మొహాలీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అమృత్‌సర్ 19.5 ఓవర్లలో 258 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. కెప్టెన్‌ అభిషేక్‌ శర్మ విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అభిషేక్.. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 26 బంతుల్లో మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్‌.. 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 77 పరుగులు చేశాడు. అతడితో పాటు నమన్‌ ధీర్‌(22 బంతుల్లో 5 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 47), సహజ్‌ ధావన్‌(45) రాణించారు. మొహాలీ బౌలర్లలో తేజ్‌ప్రీత్‌ సింగ్‌ మూడు వికెట్లు, తన్మయ్‌ ధరణి, హర్‌ప్రీత్‌ బ్రార్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అన్మోల్‌ సూపర్‌ సెంచరీ అనంతరం ఈ భారీ లక్ష్య చేధనలో మొహాలీ ఫస్ట్‌ డౌన్‌ బ్యాటర్‌ అన్మోల్‌ప్రీత్ సింగ్ అద్భుత సెంచరీతో కదం తొక్కాడు. కేవలం 51 బంతుల్లో 10 ఫోర్లు, 12 సిక్స్‌లతో 133 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్‌ రమణ్‌దీప్‌ సింగ్‌(40 బంతుల్లో 9 ఫోర్లు, ఒక​ సిక్సర్‌తో 69) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఫలితంగా మొహాలీ జట్టు లక్ష్యాన్ని 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.3 ఓవర్లలో చేధించింది. ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు) వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ! Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05) కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు) నేపాల్ వరదల్లో 25 మంది తెలంగాణ NRIలు గల్లంతు..! టీడీపీ ఎమ్మెల్యే అండతోనే నన్ను చంపేస్తా అని ఇంటికొచ్చి బెదిరించాడు YSR సంకల్పం.. వెలిగొండ వాస్తవాలు.. బాబు క్రెడిట్ చోరీ నువ్వు నిరూపిస్తే నేను దేనికైనా రెడీ... వేమిరెడ్డికి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ మూవీ కెళ్ళి మధ్యలోనే వచ్చేశా..! టాక్సిక్ అసలు సినిమానేనా..!

Original source: sakshi.com
Read more on Kaizer News