Shorts Rayachoti: గాలివీడు మండలం చీమలచెరువుపల్లె గ్రామం కమలామర్రికి చెందిన వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నాయకుడు శంకర్‌రెడ్డి కుమారుని కేశఖండన కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి హాజరై చిన్నారిని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమలామర్రిలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు శ్రీకాంత్‌రెడ్డిని ఆత్మీయంగా కలుసుకున్నారు. వారితో మమేకమైన ఆయన స్థానికంగా పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ స్టేట్ లీగల్ సెల్ కోఆర్డినేటర్ జల్లా సుదర్శన్‌రెడ్డి, మండల కన్వీనర్ మిట్టపల్లె యధుభూషణ్‌రెడ్డి, ఉమాపతిరెడ్డి, గుమ్మా అమరనాథరెడ్డి,కేశవ రెడ్డి,కృష్ణారెడ్డి, రామేశ్వర్ , భయ్యారెడ్డి, మస్తాన్, ధనంజయ రెడ్డి, అక్రమ్, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు