Kaizer News

Jukkal: అసెంబ్లీలో రైతుల పక్షాన గళమెత్తిన జుక్కల్

Jukkal: అసెంబ్లీలో రైతుల పక్షాన గళమెత్తిన జుక్కల్ ఎమ్మెల్యే తోట!

· State - Telangana · hmtvlive.com

Shorts జుక్కల్: ఎల్‌నినో ప్రభావం, వర్షాభావంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అసెంబ్లీలో ప్రస్తావన.. రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని విజ్ఞప్తి. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తెలంగాణ శాసనసభలో రైతాంగ సమస్యలను ప్రస్తావించారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, తక్కువ వర్షపాతం, వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సభదృష్టికితీసుకెళ్లారు. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో పంటల సాగు దెబ్బతింటోందని, దిగుబడులు తగ్గే పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ పరిస్థితుల్లో రైతులకు అవసరమైన సహాయం, వ్యవసాయ మద్దతు వెంటనే అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అన్నదాతలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచి, వర్షాభావంతో నష్టపోయే రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు శాసనసభలో విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News