Kaizer News

అపూర్వ రాగం-56

అపూర్వ రాగం-56

· State - Telangana · ntnews.com

(హాలుని ‘గాథా సప్తశతి’ ఆధారంగా రూపొందించిన ప్రణయ గాథ) సచ్చసామితో కలిసి జంగిటికి వెళ్లడానికి సిద్ధమవుతాడు మేఘచంద్రుడు. జయసేనుని మీదికి ఈసాణుడు గురి చూసి విసిరిన ఈటెను అడ్డుకుంటాడు ఒక వీరుడు. కాషాయ వస్త్రాలు ధరించి శ్రీకూర్మం బయల్దేరిన ప్రణాళుడికి, రోహదేవికి ఒక కొత్త వ్యక్తి ఎదురుపడతాడు. తర్వాత… మామిడి తోటలోని భూగృహం వద్దకు ముందుగా చేరుకున్న అశ్వికుడు అలక్కుడు అక్కడ ఆగిపోయినాడు. అతణ్ని అనుసరిస్తున్న పదిమంది వస్తాదులు; బండిమీద బంధించి తీసుకొస్తున్న పోటిసుడు; మరో రథంలో సవరసత్తి; మిగతా అందరూ వచ్చినారు. అలక్కుడు వస్తాదుల వంక చూసి.. “మీరు లోపలికి దిగి, అంతా సవ్యంగా ఉందేమో చూసి రండి!” అని ఆజ్ఞాపించినాడు. “చిత్తం స్వామీ!” అంటూ ఆ పదిమంది బిలబిలమంటూ భూ గృహంలోకి దిగినారు. నిమిషాలు గడుస్తున్నాయి. లోపలి నుంచి ఏ సమాచారమూ లేదు. వెళ్లిన వారిలోంచి ఒక్కరు కూడా తిరిగి రాలేదు. వెంట వచ్చిన సాయుధులైన సైనికులను చూసి.. “మీరు వెళ్లండి! ఆయుధాలు ధరించండి! అప్రమత్తంగా ఉండండి! ఎవరైనా దాడి చేస్తే ఎదుర్కొండి! నిర్దయగా చంపేసేయండి! తొందరగా సమాచారం ఇవ్వండి!” అన్నాడు. పన్నెండు మంది సైనికులు విచ్చుకత్తులతో లోపలికి దిగినారు. ఫలితంలో మార్పు లేదు! ఎవ్వరూ తిరిగిరాలేదు. అలక్కుడి భృకుటి ముడిపడింది. లోపల ఏదో జరుగుతున్నదని అర్థమవుతున్నది కానీ, ఏం జరుగుతున్నదో ఊహకు అందడం లేదు! ఇక తానే స్వయంగా రంగంలోకి దిగక తప్పదని నిర్ణయించుకున్నాడు అలక్కుడు. అయితే ముందు దిగిన వారిలాగా కాకుండా, కొత్త పద్ధతిలో దిగడం సురక్షితం అనిపించింది! తాను దిగడానికి ముందు.. ఒక గుర్రపు జీనుకు గుడ్డలు చుట్టి, దానిని భూ గృహంలోకి విడిచినాడు. నాలుగు అడుగులు లోపలికి పంపగానే, ఇద్దరు బలిష్ఠులైన ఆటవికులు ఆ జీనుని మనిషి అనుకొని గబుక్కున పక్కకు లాక్కునిపోయి, మీద పడి చంపబోయినారు. ఆ వెంటనే మరో ఇద్దరు మనుషులు అలక్కునిపై దాడి చేయడానికి ప్రయత్నించడం గమనించి, ఒడుపుగా తప్పించుకొని.. వాళ్లలో ఒకణ్ని కత్తితో గాయపరిచి, మరొకణ్ని కాలితో దూరంగా తన్నినాడు. చుట్టూ పరికించినాడు. అంతకుముందు తన మనుషులు కట్టిపడేసిన పోటిసుని ప్రియురాలు.. ఇప్పుడు విలాసంగా కూర్చొని, వినోదం చూస్తున్నది. చాలామంది ఆటవికులు ఈటెలు, బాణాలతో పైనబడి చంపడానికి సిద్ధంగా ఉన్నారు… నలుగురు మనుషులు హఠాత్తుగా పైన పడ్డారు. గాయాలను లెక్కచేయకుండా వాళ్లను నిలువరిస్తూనే, ఆ యువతి వద్దకు చేరుకొని, మెరుపు వేగంతో ఆమెను ఒడిసి పట్టుకున్నాడు అలక్కుడు. కత్తిని ఆమె మెడకు ఆనించినాడు. “మీరు అతి తెలివి ప్రదర్శిస్తే ఈమె గొంతు తెగుతుంది! ఎక్కడి వాళ్లు అక్కడే ఆగిపొండి!” అని గట్టిగా అరచినాడు. భూ గృహం పైన ఉన్న అలక్కుని సైన్యానికి, పోటీసునికి, సవరసత్తికి… లోపల ఏం జరుగుతున్నదో అనే ఆందోళన అధికమైంది. పోటిసుడు అలక్కుని మనుషులను ఉద్దేశించి ఇట్లా అన్నాడు.. “వీరులారా! మీకు ఈ నమ్మినబంటు పోటిసుని గౌరవపూర్వక వందనాలు!” ఆ మాటలకు అక్కడున్న సుమారు ఎనభై మంది సైనికులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కొందరు ముభావంగా ఉన్నారు; కొందరి మొహాల్లో నవ్వు విరిసింది; చాలామంది మొహాల్లో ఒక కొత్త కాంతి కనిపించింది. అందుకు కారణం… ఎప్పుడూ వాళ్లు వంద

Original source: ntnews.com
Read more on Kaizer News