న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్ల డైరెక్షన్‌ను ఈ వారం ఇండియా జూన్ క్వార్టర్ జీడీపీ డేటా, ముడి చమురు ధరలు, అమెరికా జాబ్స్ డేటా నిర్దేశించనున్నాయని ఎనలిస్టులు తెలిపారు. వీటితో పాటు ఆగస్టు నెల ఆటో అమ్మకాలు, పీఎంఐ డేటా, విదేశీ ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐల) కొనుగోళ్లు మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపనున్నాయి. దేశీయ డేటా (ఆగస్టు 31): జూన్ క్వార్టర్‌కి సంబంధించి జీడీపీ డేటా సోమవారం విడుదల కానుంది. దీంతో పాటు జీఎస్టీ వసూళ్లు, మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ పీఎంఐ, ఫారెక్స్ నిల్వలు, రూపాయి కదలికలను ఇన్వెస్టర్లు గమనించనున్నారు. యూఎస్ జాబ్స్ డేటా (సెప్టెంబర్ 4): యూఎస్ నాన్‌ఫార్మ్ పేరోల్ డేటా శుక్రవారం వెలువడనుంది. యూఎస్ జాబ్స్ రిపోర్ట్ గ్లోబల్ మార్కెట్లకు అత్యంత కీలకం. సెప్టెంబర్ ఫెడ్ పాలసీలో వడ్డీ రేట్ల పెంపు లేదా తగ్గింపు అంచనాలను ఈ రిపోర్ట్ ప్రభావితం చేయనుంది. ఎఫ్‌ఐఐల పెట్టుబడులు: ఎఫ్‌ఐఐలు ఆగస్టులో నికరంగా రూ.30,919 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇది మార్కెట్లకు సానుకూల అంశం