బీఆర్‌ఎస్ సర్కార్ మంజూరు చేసిన డబుల్ రోడ్డును నిర్మించాలని డిమాండ్ చేస్తూ గన్నేరువరంలో యువకులు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు వరకు బీఆర్‌ఎస్ సర్కార్ డబుల్ రోడ్డు మంజూరు చేసింది. ఈ రోడ్డు పనులు చేపట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు, స్థానిక యువకులు అనేకసార్లు ఆందోళనలు చేపట్టారు