Kaizer News

Bayyakkapeta-Mulugu Dist.|బయ్యక్కపేటలో గుర్తుతెలియ

Bayyakkapeta-Mulugu Dist.|బయ్యక్కపేటలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

· State - Telangana · prabhanews.com

బయ్యక్కపేటలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం Bayyakkapeta-Mulugu Dist.| తాడ్వాయి, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా తాడ్వాయి మండలం బయ్యక్కపేట గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై నార్లాపూర్‌ ఎస్‌ఐ కమలాకర్‌ వివరాలు వెల్లడించారు. బయ్యక్కపేట శివారులోని వట్టివాగు సమీపంలో సుమారు 50 నుంచి 55 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న నార్లాపూర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు తెల్ల రంగు లుంగీ (పచ్చ అంచుతో), నీలం రంగు టవల్‌ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు వెంటనే నార్లాపూర్‌ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. వివరాల కోసం నార్లాపూర్‌ ఎస్‌ఐ ఫోన్‌ నంబర్లు 8712670131, 8712670132 లను సంప్రదించాలని పోలీసులు సూచించారు

Original source: prabhanews.com
Read more on Kaizer News