Kaizer News

విమానంలో ఎగరాల్సిన నేహా.. ఇప్పుడు వేల కి.మీ. ట్రక్

విమానంలో ఎగరాల్సిన నేహా.. ఇప్పుడు వేల కి.మీ. ట్రక్‌ నడుపుతూ..

· National - India · sakshi.com

హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీకి చెందిన నేహా ఠాకూర్‌ చిన్నప్పటి నుంచి ఉన్న భారీ ట్రక్కులపై ఆసక్తిని వృత్తిగా మార్చుకున్నారు. గ్రాడ్యుయేషన్‌ తర్వాత చండీగఢ్‌లో విమాన సహాయకురాలి శిక్షణ తీసుకున్నప్పటికీ, చివరకు ట్రక్‌ డ్రైవింగ్‌నే వృత్తిగా ఎంచుకున్నారు. ప్రస్తుతం ఆమె హిమాచల్‌ప్రదేశ్‌ తొలి మహిళా ట్రక్ డ్రైవర్‌గా గుర్తింపు పొందారు. నేహాకు చిన్నప్పటి నుంచే పెద్ద టైర్లు, భారీ ట్రక్కులంటే ఆసక్తి ఉండేది. ఆమె తండ్రి కూడా ట్రక్ డ్రైవర్‌ కావడంతో ఆయన పనితీరు, కష్టపడే విధానం నేహాపై ప్రభావం చూపాయి. తండ్రి తరచూ ట్రక్‌లోనే ఆమెను పాఠశాలకు తీసుకెళ్లేవారు. 2022లో ట్రక్ నడపాలని నేహా నిర్ణయించుకున్నప్పుడు ఆమె తండ్రి పూర్తి మద్దతు ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె ట్రక్ డ్రైవింగ్‌ ప్రారంభించారు. ఆ నిర్ణయంతో హిమాచల్‌ప్రదేశ్‌లో తొలి మహిళా ట్రక్ డ్రైవర్‌గా నిలిచారు. అయితే అంతకుముందు నేహా మరో వృత్తి వైపు అడుగులు వేశారు. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన తర్వాత చండీగఢ్‌కు వెళ్లి విమాన సహాయకురాలి వృత్తిపరమైన శిక్షణ తీసుకున్నారు. విమానయాన రంగంలో కొనసాగేందుకు అవకాశం ఉన్నప్పటికీ, తనకు చిన్నప్పటి నుంచి ఉన్న ట్రక్ డ్రైవింగ్‌ ఆసక్తినే ఎంచుకున్నారు. ఈ నిర్ణయానికి కుటుంబం కూడా మద్దతు ఇచ్చింది. ట్రక్ నడపడమే కాకుండా తన రోజువారీ జీవితాన్ని కూడా నేహా సామాజిక మాధ్యమాల్లో వీడియోల రూపంలో పంచుకుంటున్నారు. వర్షం, ఎండ వంటి వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా ట్రక్‌కు సంబంధించిన వీడియోలను ఆమె షేర్‌ చేస్తున్నారు. ట్రక్‌ ప్రారంభమైన వెంటనే తన కెమెరా కూడా ప్రారంభమవుతుందని ఆమె ఓ వీడియోలో చెప్పింది. ప్రస్తుతం నేహా ట్రక్ డ్రైవింగ్‌ అనుభవాలు, రోజువారీ ప్రయాణాలను వీడియోల ద్వారా షేర్‌ చేస్తున్నారు. దీంతో ఆమె వృత్తి ప్రయాణం సామాజిక మాధ్యమాల్లో మరింతగా దృష్టిని ఆకర్షిస్తోంది. కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు) ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు) గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై టీడీపీ నేతపై జర్నలిస్ట్ హిమబిందు సంచలన ఆరోపణలు రాకాతో హాలీవుడ్ ను టార్గెట్ చేసిన అల్లు అర్జున్? గుంటూరులో మరో లాకప్ డెత్.. అడ్వకేట్ రజిని స్ట్రాంగ్ వార్నింగ్

Original source: sakshi.com
Read more on Kaizer News