Kaizer News

వెలుగు స్పెషల్ : తిలాపాపం తలా పిడికెడు.. సాదాసీదాగ

వెలుగు స్పెషల్ : తిలాపాపం తలా పిడికెడు.. సాదాసీదాగా ముగిసిన అసెంబ్లీ సమావేశాలు

· State - Telangana · v6velugu.com

తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. ఉద్రిక్తతల నడుమ మొదలై 8 పని దినాలపాటు సాగిన ఈ సెషన్ శుక్రవారమే సాదాసీదాగా ముగిసింది. సభను స్పీకర్ నిరవధికంగా వాయిదా వేశారు. మండలి కూడా వాయిదా పడింది. సభాపర్వంలో పాలక, విపక్షాలు విఫలమవుతూ శాసనసభ స్థాయిని తగ్గిస్తున్న సమయంలోనే... హైకోర్టు తన తాజా తీర్పుతో సభా నిర్వహణ నాణ్యతను ప్రశ్నార్థకం చేసింది. పార్టీ మారిన ఒక సభ్యుడిని పార్టీ మార్పిళ్ల (నిరోధక) చట్టం కింద అనర్హుడిగా ప్రకటించాలన్న సభ్యుల వినతిని తిరస్కరిస్తూ స్పీకర్ లోగడ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ శాసనసభ్యుడు (ఖైరతాబాద్)గా ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ (సికింద్రాబాద్) అభ్యర్థిగా పోటీచేసిన డి.నాగేందర్​ను శాసనసభకు అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు శుక్రవారం నాడే తీర్పిచ్చింది. దేశంలోని పలు చట్టసభల్లో స్పీకర్లు ఏకపక్షంగా వ్యవహరిస్తూ, పార్టీ మార్పిళ్ల (నిరోధక) చట్టాన్ని హాస్యాస్పదం చేస్తున్న తరుణంలో ఇది సంచలన తీర్పు. తెలంగాణ శాసనసభలో మరో 8 వరకు అటువంటి కేసులున్నాయి. వాటి గతి ఏమిటో వేచిచూడాలి. శాసన సభను మరింత ప్రజాస్వామ్య పద్ధతిలో నడుపుకుంటూ, ప్రజల విశాస్వం పెంపొందింపజేయడానికి ఇది అత్యుత్తమ సమయం. పాలక విపక్షాలదే బాధ్యత. ప్రజా సమస్యల్ని ప్రతిబింబించడానికి, పరిష్కారాల సాధనకు ప్రతిపక్షం వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. సభ సజావుగా నడుస్తూ జన విశ్వాసం పొందడానికి శాసనసభ నిబంధనలకు తోడు సంప్రదాయాలను కూడా గౌరవిస్తూ, పాటిస్తూ పాలకపక్షం పట్టువిడుపులతో నడుచుకోవాలి. ఇవి రెండూ లోపిస్తున్న పరిస్థితికి తెలంగాణ అసెంబ్లీ తాజా సమావేశాలు అద్దం పట్టాయి. సభలోవుంటూ, ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రభుత్వ పథకాలు, విధానాలను సంస్కరించడానికి గల అవకాశాలను సద్వినియోగ‌‌‌‌‌‌‌‌పరుచుకోవడంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ విఫలమైంది. నిరసన తెలపడమే ఉద్దేశమైతే ఖాళీ నల్ల చొక్కాలతో సభకు వచ్చే ప్రయత్నం చేయాల్సింది. చొక్కాలపై నినాదాలు రాసుంటే సభలోకి అనుమతించకూడదన్న నిబంధన తమ హయాంలో తీసుకున్నదే అయినపుడు... అలా రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రెండో రోజయినా పరిస్థితిని సస్పెన్షన్ దాకా రానీయకుండా చూసుకోవాల్సింది. సెషన్ మొత్తం వారు సభలో లేక రాజధాని, శివార్లలోని కోటిన్నర మంది జీవితాల్ని ప్రభావితం చేసే ‘క్యూర్‌‌‌‌‌‌‌‌’ వంటి బిల్లులు సమగ్ర చర్చ, తగిన ప్రతిఘటన లేకుండానే ఆమోదం పొందే పరిస్థితి వచ్చింది. బిల్లును తిరస్కరించండి అంటూ దొంతి నర్సింహారెడ్డి వంటి పాలసీ నిపుణులు రాష్ట్ర గవర్నర్​ని కోరాల్సి వచ్చింది. ‘సస్పెన్షన్ ఎత్తివేయండి, మేం సభకు వస్తాం’ అని విపక్షం కోరినప్పుడు పాలకపక్షం, ప్రభుత్వం సమ్మతించి ఉండాల్సింది. ఇటువంటి సంప్రదాయం సభలో లోగడ పలుమార్లు పాటించిందే! రాష్ట్రం ఎదుర్కొంటున్న తీవ్ర కరువు, వర్షాభావ పరిస్థితి, ఎల్​నినో ప్రభావ ప్రతికూలత, 22(ఏ) నిషేధిత భూవివాదాలు వంటి కీలకాంశాలు సభలో చర్చిస్తున్నప్పుడు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ లేకపోవడం రాష్ట్ర ప్రజలకు జరిగిన నష్టంగానే పరిగణించాల్సి ఉంటుంది. ఇది విపక్షం స్వయం కృతం అన్నది ప్రభుత్వ వాదన. సభ లోపల పాలకపక్షం, సభ బయట విపక్షం మీడియా ద్వారా తమ వ

Original source: v6velugu.com
Read more on Kaizer News