Kaizer News

OnePlus 13s: 16GB RAMతో OnePlus 13s కొత్త వేరియంట్

OnePlus 13s: 16GB RAMతో OnePlus 13s కొత్త వేరియంట్ రిలీజ్.. 50MP కెమెరా, 5,850mAh బ్యాటరీ

· National - India · ntvtelugu.com

16GB RAMతో OnePlus 13s కొత్త వేరియంట్ రిలీజ్.. 50MP కెమెరా, 5,850mAh బ్యాటరీ 16GB RAMతో OnePlus 13s కొత్త వేరియంట్ 50MP కెమెరా, 5,850mAh బ్యాటరీ Follow Us : --> Add as a preferred source on google OnePlus 13s New 16GB Variant: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus భారత మార్కెట్లో OnePlus 13s సిరీస్‌లో కొత్త టాప్-ఎండ్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఇప్పటివరకు 12GB RAM వరకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌ ఇప్పుడు 16GB RAM + 512GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో లభిస్తోంది. దీని ధరను కంపెనీ రూ.68,999గా నిర్ణయించింది. కొత్త వేరియంట్‌లో పవర్ ఫుల్ Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్‌, 50MP డ్యూయల్ కెమెరాలు, 5,850mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. RAM- స్టోరేజ్ -ధర 12GB 256GB రూ.54,999 12GB 512GB రూ.59,999 16GB 512GB రూ.68,999 కొత్త 16GB RAM వేరియంట్‌ను Amazonతో పాటు OnePlus అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. కొత్త OnePlus 13s కొనుగోలుపై పలు బ్యాంక్ కార్డులతో రూ.2,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. HDFC, ICICI, Kotak, IDFC First, IndusInd Bank క్రెడిట్ కార్డులకు ఈ ఆఫర్లు వర్తిస్తాయని కంపెనీ పేర్కొంది. అయితే ఆఫర్ల నిబంధనలు, చెల్లుబాటు వివరాలు కొనుగోలు సమయంలో చెక్ చేయాలి. OnePlus 13s మూడు రంగుల్లో లభిస్తుంది.. Black Velvet, Green Silk, Pink Satin. OnePlus 13sలో 6.32-అంగుళాల 1.5K LTPO ProXDR AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 2,640 × 1,216 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. డిస్‌ప్లేలో 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్ఠంగా 1,600 nits బ్రైట్‌నెస్, Aqua Touch 2.0, 2,160Hz PWM dimming వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతో స్క్రోలింగ్, గేమింగ్, వీడియో కంటెంట్ మరింత స్మూత్‌గా ఉండేలా డిస్‌ప్లేను రూపొందించారు. ఫోన్‌కు Qualcomm Snapdragon 8 Elite చిప్‌సెట్ పవర్ అందిస్తుంది. కొత్త టాప్ వేరియంట్‌లో 16GB LPDDR5X RAM, 512GB UFS 4.0 స్టోరేజ్ ఉన్నాయి. హై-ఎండ్ గేమింగ్, మల్టీటాస్కింగ్, వీడియో ఎడిటింగ్ వంటి పనులకు ఈ హార్డ్‌వేర్ ఉపయోగపడుతుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే 5G, 4G LTE, Wi-Fi 7, Bluetooth 6.0, GPS, NavIC, NFC, USB Type-C పోర్ట్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఫోటోగ్రఫీ కోసం OnePlus 13sలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ఇచ్చారు. 50MP Sony LYT-700 ప్రైమరీ కెమెరా – OIS, f/1.8 అపెర్చర్, 50MP టెలిఫోటో కెమెరా – 2x ఆప్టికల్ జూమ్, f/2.0, EIS, 32MP ఫ్రంట్ కెమెరా – f/2.0 అపెర్చర్. ప్రైమరీ కెమెరాలో OIS ఉండటం వల్ల తక్కువ వెలుతురు పరిస్థితుల్లోనూ, చేతి కదలికల వల్ల వచ్చే బ్లర్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. OnePlus 13sలో 5,850mAh బ్యాటరీ అందించారు. దీనికి 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అదనంగా ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంది. ఫోన్ పరిమాణం 150.8 × 71.7 × 8.2mm, బరువు సుమారు 185 గ్రాములు. Snapdragon 8 Elite వంటి ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్, 16GB RAM ఉన్నప్పటికీ ఫోన్‌ను కాంపాక్ట్‌గా ఉంచడం OnePlus 13sలో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు

Original source: ntvtelugu.com
Read more on Kaizer News