Kaizer News

ఊపేస్తున్న 'ప్యారడైజ్' కొత్త పాట.. మీరు విన్నారా?

ఊపేస్తున్న 'ప్యారడైజ్' కొత్త పాట.. మీరు విన్నారా?

· Entertainment · sakshi.com

నాని 'ప్యారడైజ్' సినిమా వచ్చే నెల 24న థియేటర్లలో రిలీజ్ కానుంది. చెప్పాలంటే ఈ పాటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేయాలి. తొలుత మార్చి అనుకున్నారు కుదరలేదు. ఆగస్టుకి వాయిదా వేశారు కానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఫైనల్‌గా సెప్టెంబరు అంటున్నారు. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఆరు నెలల క్రితం ఈ సినిమాలోని 'ఆయా షేర్' పాట రిలీజ్ చేయగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు 'యేషనాగుల' అంటూ అందరికీ తెలిసిన తెలంగాణ ఫోక్ సాంగ్‌ని ఈ మూవీ కోసం రీక్రియేట్ చేశారు. అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన లైవ్ కాన్సర్ట్‌లో అనిరుధ్ స్వయంగా ఈ పాటని ఆలపించి రిలీజ్ చేశాడు. యూట్యూబ్, స్ఫూటిఫై లాంటి వాటిలో ఆడియో వదిలారు. వీడియో సాంగ్ కూడా తాజాగా రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో 'యేషనాగుల' సాంగ్ ఓ ఊపు ఊపేస్తోంది. ఒరిజినల్ పాట పాడిన జంగిరెడ్డి దీనిని కూడా అలపించగా, ఈయనతో పాటు ప్రభ కూడా పాడింది. సినిమాకు తగ్గట్లు కొన్ని కొత్త లిరిక్స్ కాసర్ల శ్యామ్ రాశారు. మూడు నిమిషాల నిడివితో ఉన్న ఈ పాట ప్రస్తుతం శ్రోతలకు తెగ నచ్చేస్తోంది. నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు) ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు) బాబు బుద్ధులే కొడుక్కి వచ్చాయి... నువ్వు ఓ పిరికిపందవి... ఉతికారేసిన కారుమూరి ఇరుముడి సక్సెస్ తో జాక్పాట్...హీరో, డైరెక్టర్ కు ఆఫర్ల వర్షం! ఎక్కడికి పోయావ్ అయ్యా పవన్ కళ్యాణ్.. నిన్ను ఎమ్మెల్యే చేసినందుకు చెప్పుతో కొట్టుకోవాలి

Original source: sakshi.com
Read more on Kaizer News