Shorts పోడూరు: పెనుగొండ గాంధీ బొమ్మల కచేరి సెంటర్‌లో పోడూరు ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ఏపీ వీఆర్ఏ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రిలే దీక్ష కొనసాగుతోంది. ఈ సహాయ నిరాకరణ ఉద్యమానికి మద్దతుగా పెనుగొండ మండల పోడూరు మండల వీఆర్వోలు సంఘీభావం తెలిపారు. వీఆర్ఏలతో కలిసి నిరసనకార్యక్రమంలో పాల్గొన్నారు.నరసాపురం డివిజన్ వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు తానేటి నాగరాజు ఆధ్వర్యంలో ఈ నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా తానేటి నాగరాజు మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో ఏళ్ల తరబడి ప్రజలకు సేవలందిస్తున్న వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. అర్హత, అనుభవం కలిగిన వీఆర్ఏలకు వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలని, పేస్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. నామినీ వీఆర్ఏలను క్రమబద్ధీకరించడంతో పాటు పదోన్నతులకుసంబంధించినసమస్యలనుపరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వీఆర్ఏ సంఘం ఉపాధ్యక్షుడు గొల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ.. చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించడం వీఆర్ఏలకు కష్టంగా మారిందన్నారు. నిత్యావసర సరుకుల ధరలుఆకాశాన్నంటుతున్నప్పటికీ వీఆర్ఏల జీతాలు మాత్రంఅంతంతమాత్రంగానే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన జీతంతో కుటుంబాన్నిపోషించుకోవాలా.. అనారోగ్యానికి గురైతే ఆసుపత్రి ఖర్చులు భరించాలా అనే పరిస్థితి నెలకొందన్నారు. ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలను ఇకనైనా పట్టించుకుని న్యాయమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు