Kaizer News

ప్రజల చెంతకే ఉచిత న్యాయసేవలు..

ప్రజల చెంతకే ఉచిత న్యాయసేవలు..

· State - Telangana · prabhanews.com

బాల్కొండలో లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ ప్రారంభం ప్రతి శనివారం న్యాయ సలహాలు.. చట్టాలపై అవగాహన సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి బాల్కొండ, ఆంధ్రప్రభ : న్యాయ సహాయం అవసరమైన పేదలు, నిరుపేదలు,అక్షరాస్యత లేని వారు,సామాన్య ప్రజలకు న్యాయసేవలను మరింత చేరువ చేసేందుకు నిజామాబాద్ జిల్లా బాల్కొండలో లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ ప్రారంభమైంది. ఆర్మూర్‌ లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్‌,సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీదేవి శనివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో క్లినిక్‌ను ప్రారంభించారు.ఇకపై ప్రతి శనివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్యానల్‌ అడ్వకేట్‌ కొండి పవన్‌కుమార్‌ క్లినిక్‌లో అందుబాటులో ఉండి ప్రజలకు న్యాయ సలహాలు,చట్టాలపై అవగాహన,అవసరమైన న్యాయ సహాయం అందించనున్నారని ఆమె అన్నారు. ఈ సందర్భంగా జడ్జి శ్రీదేవి మాట్లాడుతూ న్యాయసేవలు పొందేందుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో లీగల్‌ ఎయిడ్‌ సేవలను ప్రజల చెంతకు తీసుకొస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి తమ హక్కులు,చట్టపరమైన రక్షణలు,అందుబాటులో ఉన్న న్యాయసేవలపై పూర్తి అవగాహన ఉండదన్నారు. ముఖ్యంగా పిల్లలపై లైంగిక దాడులు వంటి నేరాలకు సంబంధించి చట్టాల్లో కఠినమైన శిక్షలు ఉన్నప్పటికీ,వాటిపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ చట్టాలపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం కూడా లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ బాధ్యతల్లో భాగమని వివరించారు.న్యాయ సహాయం కోసం బాధితులు స్వయంగా కార్యాలయాలకు లేదా కోర్టులకు రాలేని పరిస్థితుల్లోనూ వారికి చేరువయ్యేందుకు లీగల్‌ సర్వీసెస్‌ సంస్థలు చర్యలు తీసుకుంటాయని సీనియర్ సీవిల్ జడ్జి శ్రీదేవి తెలిపారు. అవసరమైన సందర్భాల్లో సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించి, బాధితులకు అందుబాటులో ఉన్న న్యాయ సహాయాన్ని కల్పించే అవకాశం ఉందన్నారు. గతంలో కార్మికులకు సంబంధించిన సమస్యల్లోనూ లీగల్‌ సర్వీసెస్‌ సంస్థ జోక్యం చేసుకుని కేసుల నమోదుకు సహకరించిన సందర్భాలను ఆమె ప్రస్తావించారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న రాజీకి అవకాశం ఉన్న కేసులను లోక్‌ అదాలత్‌ ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందని జడ్జి శ్రీదేవి తెలిపారు. వివాహ సంబంధ,సివిల్‌,నగదు రికవరీ తదితర కేసుల్లో ఇరుపక్షాలు అంగీకరిస్తే లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించే లోక్‌ అదాలత్‌ ద్వారా పరిష్కారం పొందవచ్చన్నారు.దీంతో కేసుల పరిష్కారంలో సమయం, ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పెండింగ్‌ కేసులున్న వారు రాజీకి అవకాశం ఉన్న అంశాలను పరిశీలించుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు న్యాయసేవలు అందించడంతో పాటు చట్టాలను గౌరవించేలా అవగాహన కల్పించడమే లీగల్‌ సర్వీసెస్‌ వ్యవస్థ ప్రధాన ఉద్దేశమని ఆమె వివరించారు.న్యాయపరమైన సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా అందుబాటులో ఉన్న ఉచిత న్యాయసేవలను వినియోగించుకోవాలని కోరారు. న్యాయ సహాయం, చట్టాలపై అవగాహన, బాధితులకు అవసరమైన సహకారం వంటి సేవలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ కృషి చేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గాండ్ల రాజేష్‌, ప్యానల్‌ అడ్వకేట్‌ కొండ

Original source: prabhanews.com
Read more on Kaizer News