ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ధర్మపథం’ నిత్య సాంస్కృతిక వేదికపై ఆదివారం కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఎం. పావని బృందం ‘ఓం సర్వాణి’, ‘గణేశ పంచరత్నం’, ‘హిమగిరి తనయే హేమలతే’, ‘గోవర్ధన గిరిధర గోవిందా’, ‘మహిషాసుర మర్దిని స్తోత్రం’ తదితర అంశాలను అభినయించింది. లయబద్ధమైన పాదన్యాసాలు, భావయుక్త అభినయాలతో కళాకారులు ఆకట్టుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు కళాకారులను ఆలయ మర్యాదలతో సత్కరించారు