సింగూర్ ప్రాజెక్టు పనుల తనిఖీలో ఈఎన్‌సీ బృందం మిషన్ భగీరథ, హెచ్‌డబ్ల్యూఎంఎస్‌కు తాగునీటి సరఫరాపై పరిశీలన సంగారెడ్డి ప్రతినిధి, (ఆంధ్రప్రభ): సింగూర్ ప్రాజెక్టు పరిధిలో కొనసాగుతున్న నీటిపారుదల పనులను ఇరిగేషన్ శాఖ ఈఎన్‌సీ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ, హెచ్‌డబ్ల్యూఎస్ ద్వారా అందుతున్న తాగునీటి సరఫరా పరిస్థితిని ఆయన సమీక్షించారు. ప్రాజెక్టులో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, తాగునీటి అవసరాలు మరియు కొనసాగుతున్న పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే, ప్రాజెక్టు పరిధిలో జరుగుతున్న పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో సంగారెడ్డి నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ విద్యావతి, ఎస్‌ఈ యశస్వి, ఈఈ బండి భీమ్, ఏఈఈలతో పాటు మిషన్ భగీరథ ఈఈ, హెచ్‌డబ్ల్యూఎస్ ఈఈ తదితర అధికారులు పాల్గొన్నారు