పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన తాడ్వాయి, ఆంధ్రప్రభ : ‘స్వచ్ఛతా హీ సేవా’, ‘స్వచ్ఛతా మే సహభాగ్’, ‘స్వచ్ఛ భారత్–వికసిత్ భారత్’ కార్యక్రమాల్లో భాగంగా కాటాపురం జడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు. కాటాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ దిడ్డి మోహన్‌రావు ఆధ్వర్యంలో పాఠశాల పరిసరాలను శుభ్రపరిచారు. విద్యార్థుల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను తమ బాధ్యతగా భావించాలని సూచించారు. రంగాపూర్ గ్రామపంచాయతీలోనూ స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ శివప్రసాద్, పంచాయతీ కార్యదర్శి రవీకుమార్ ఆధ్వర్యంలో పరిసరాలను శుభ్రపరిచారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు స్వచ్ఛ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కోరం భాగ్యరాణి, పాఠశాల హెచ్‌ఎం బాణాల సుధాకర్, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు