Kaizer News

మహిళలే మహారాణులు.. వ్యవసాయంలో దూసుకెళ్తున్న మహిళా శక్తి

· State - Telangana · tv9telugu.com

వ్యవసాయం అంటే ఒకప్పుడు పురుషులే ముందుండేవారు.. కానీ ఇప్పుడు సీన్ మారింది. పొలంలో విత్తనం వేసే చేతులే కాదు.. విత్తనం నుంచి మార్కెట్‌ వరకు నిర్ణయాలు తీసుకునే స్థాయికి మహిళలు ఎదుగుతున్నారు. అందుకు నిదర్శనంగా నిలుస్తోంది నిర్మల్ జిల్లా లక్ష్మణ చందా మండలంలోని మహిళా రైతు సమాఖ్య. ఇక్కడ మహిళలు కేవలం వ్యవసాయం చేయడం మాత్రమే కాదు.. వ్యవసాయాన్నే వ్యాపారంగా మలుచుకుని విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. తమకు తామే ఉపాధి కల్పించుకుంటూ.. తోటి మహిళలకు గ్రామంలోని రైతులకు అండగా నిలుస్తున్నారు. నారీ శక్తికి కాదేది అసాధ్యం అని‌ నిరూపిస్తున్నారు

Original source: tv9telugu.com
Read more on Kaizer News