ఇంట్లో గోడలపై తిరిగే బల్లులు చాలామందికి అసహ్యంగాను, భయానకంగానూ అనిపిస్తాయి. ముఖ్యంగా వంటగది లేదా ఆహార పదార్థాల వద్ద ఇవి తిరగడం వల్ల లాలాజలం పడి ఆహారం విషపూరితం అయ్యే ప్రమాదం ఉంది. అయితే, వీటిని తరిమికొట్టడానికి హానికరమైన రసాయనాలు లేదా స్ప్రేలు వాడటం ఇంట్లోని చిన్న పిల్లలు, పెంపుడు జంతువులకు సురక్షితం కాదు. ఎలాంటి కెమికల్స్ లేకుండా, ఇంట్లో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో బల్లులను ఎలా తరిమికొట్టవచ్చో ఇక్కడ తెలుసుకుందాం