ఖానాపూర్ టౌన్, ఆంధ్రప్రభ : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇటీవల నిర్మల్ ప్రభుత్వ బాలికల పాఠశాల ఉర్దూ మీడియం కి చెందిన ఉపాధ్యాయుడు గౌస్ మొహియుద్దీన్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఖానాపూర్ లో ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో(2010-11) పదోతరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పూలమాలలు వేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా రంగంలో దీర్ఘకాలంగా విశేష సేవలు అందించిన ఉపాధ్యాయుడు జిల్లా స్థాయి పురస్కారాన్ని అందుకోవడం గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో కూడా అంకితభావంతో విద్యార్థులకు మార్గదర్శకత్వం వహిస్తూ విద్యా రంగంలో ఉన్నత సేవలు కొనసాగించాలని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పర్వేజ్, సల్మాన్ ఖాన్, అతీక్, అబిద్, ఇజాజ్, మిన్హాజ్ తదితరులు పాల్గొన్నారు