Kaizer News

Jangaon: ఎల్లంలలో ఘనంగా అన్నదానం: హాజరైన డీసీపీ రా

Jangaon: ఎల్లంలలో ఘనంగా అన్నదానం: హాజరైన డీసీపీ రాజమహేంద్ర నాయక్

· State - Telangana · hmtvlive.com

Shorts జనగామ జిల్లా: జనగామ జిల్లా ఎల్లంల గ్రామంలో టీం రేడియంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ పూజ, అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీసీపీ రాజమహేంద్ర నాయక్ హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న డీసీపీ భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు. ఈ సందర్భంగా టీం రేడియంట్ సభ్యులు డీసీపీ రాజమహేంద్ర నాయక్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు రచ్చ శివకుమార్, పెండల శివకుమార్, రాంబాబు, తాటి సాయికుమార్, మచ్చ సాయికుమార్, భాను, నాగేష్, భారత్, ఉదయ్, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News