Kaizer News

150 కోట్లు దాటిన ఇరుముడి

150 కోట్లు దాటిన ఇరుముడి

· Entertainment · ntnews.com

అగ్ర కథనాయకుడు రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన తాజా బ్లాక్‌బస్టర్‌ ‘ఇరుముడి’ రికార్డ్‌ కలెక్షన్లతో దూసుకుపోతున్నది. రెండోవారం సైతం బలమైన వసూళ్లు నమోదు చేస్తూ రవితేజ కెరీర్‌లోనే టాప్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల గ్రాస్‌ని క్రాస్‌ చేసిందని నిర్మాతలు నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ తెలిపారు. రవితేజ కెరీర్‌లోనే ఇది రికార్డ్‌ కావడం విశేషం. ఈ సెన్సేషనల్‌ రన్‌లో నైజాం ఏరియా కీలకంగా నిలిచిందని, కేవలం నైజాంలోనే 50కోట్లకు పైగా గ్రాస్‌ని ఈ సినిమా వసూళ్లు చేసిందని, మిగతా ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయని, బిగ్గెస్ట్‌ రీజనల్‌ హిట్స్‌లో ‘ఇరుముడి’ ఒకటిగా నిలిచిందని, నిర్మాతలకు, పంపిణీదారులకు, థియేటర్‌ యజమానులకు అత్యంత లాభదాయక చిత్రంగా ‘ఇరుముడి’ నిలిచిందని నిర్మాతలు తెలిపారు. రెండోవారంలోనూ పలు సెంటర్లలో హౌస్‌ఫుల్స్‌ కొనసాగుతున్నాయని, ఈ జోరు ఇలాగే కొన్ని రోజులపాటు కొనసాగుతుందని నిర్మాతలు అంచనా వేస్తున్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News