Shorts ములుగు జిల్లా : మల్లంపల్లి సెక్టార్ పరిధిలోని శ్రీనగర్ అంగన్వాడీ కేంద్రంలో రాష్ట్రీయ పోషణ్ మాసం సందర్భంగా పోషణ్ మహా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత, సీడీపీఓ శిరీష, సూపర్వైజర్ కమరున్నీసా, గ్రామ సర్పంచ్ ఆకుల మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పోషకాహార ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత మాట్లాడుతూ పిల్లలకు జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంచాలని, తక్కువ ఖర్చుతో లభించే అధిక పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. సీడీపీఓ శిరీష మాట్లాడుతూ అందుబాటులో ఉన్న కూరగాయలు, ధాన్యాలు, పండ్లు తదితర పోషకాహార పదార్థాలను ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవాలని తెలిపారు. సర్పంచ్ ఆకుల మల్లేష్ మాట్లాడుతూ శిశువులకు తప్పనిసరిగా ఆరు నెలల వరకు తల్లిపాలు అందించాలని సూచించారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, పాఠశాల హెచ్‌ఎం, ఏఎన్‌ఎం, అంగన్వాడీ టీచర్ బి.ఉమారాణితో పాటు తల్లులు, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు పాల్గొన్నారు