Kaizer News

మత్తు పదార్థాలపై యువతకు అవగాహన కల్పించాలి

మత్తు పదార్థాలపై యువతకు అవగాహన కల్పించాలి

· State - Telangana · prabhanews.com

చివరి శ్వాస’ షార్ట్‌ఫిల్మ్‌ ద్వారా విద్యార్థులకు అవగాహన దండేపల్లి, ఆంధ్రప్రభ : యువత డ్రగ్స్‌, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చైతన్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దండేపల్లి జడ్పీహెచ్‌ఎస్‌ ప్రధానోపాధ్యాయుడు సంఘర్ష రాజేశ్వరరావు అన్నారు. శనివారం పాఠశాల ఆవరణలో ఏకేఎస్‌ యూత్‌ బార్‌ ఆధ్వర్యంలో రూపొందించిన ‘చివరి శ్వాస’ షార్ట్‌ఫిల్మ్‌ను పదో తరగతి విద్యార్థులకు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ డ్రగ్స్‌, గంజాయి దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా షార్ట్‌ఫిల్మ్‌ రూపొందించడం అభినందనీయమన్నారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను తెలియజేసే ఇలాంటి సందేశాత్మక చిత్రాలను మరిన్ని రూపొందిస్తూ యువతను చైతన్యవంతులను చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో షార్ట్‌ఫిల్మ్‌ యూనిట్‌ సభ్యులు అల్లంల కుమారస్వామి యాదవ్‌, దూసరవీందర్‌, ఉపాధ్యాయులు అప్పల మనోహర్‌, తిరుపతి, శ్రీనివాస్‌, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News