Kaizer News

గుర్రం కోపంగా లేదు.. అది భయం! 12 ఏళ్లలోనే అలెగ్జాం

గుర్రం కోపంగా లేదు.. అది భయం! 12 ఏళ్లలోనే అలెగ్జాండర్‌ సాహసం!

· State - Telangana · sakshi.com

అ లెగ్జాండర్‌కు 12 ఏళ్ల వయసు ఉండగా అతని తండ్రి ఫిలిప్‌ దర్బారుకు ఒక వ్యాపారి చాలా అందమైన, బలమైన గుర్రాన్ని అమ్మడానికి తెచ్చాడు. దాని పేరు ‘బుసిఫాలస్‌’. కాని ఆ గుర్రం ఎంత కోపంగా ఉందంటే దాన్ని లొంగదీసుకోవడానికి దర్బారులోని పెద్ద పెద్ద వీరులు, సైనికులు వచ్చినా అది ఎవరినీ దరి చేరనివ్వకుండా వెనక కాళ్లతో తంతూ భీభత్సం సృష్టించింది. దాంతో రాజు ఫిలిప్‌ విసిగిపోయి ‘ఇది ఎవరికీ లొంగదు, దీన్ని అవతలికి తీసుకెళ్లండి‘ అన్నాడు. అప్పుడు అలెగ్జాండర్‌ ముందుకు వచ్చి, ‘నాన్న! నేను దీన్ని లొంగదీస్తాను’ అన్నాడు. అందరూ ఆ చిన్న పిల్లోడిని చూసి నవ్వారు. కానీ అలెగ్జాండర్‌ అందరిలా గుర్రాన్ని కొట్టలేదు. గుర్రం తన స్వంత నీడ కదలడం చూసి భయపడుతోందని గ్రహించాడు. వెంటనే అతను గుర్రం ముఖాన్ని సూర్యుడి వైపు తి΄్పాడు. దాంతో గుర్రానికి తన నీడ కనిపించకుండా పోయింది. అలెగ్జాండర్‌ మెల్లగా దాని వీపు నిమిరి, ఒక్క ఉదుటున దానిపైకి ఎక్కాడు. అంతే! అంతవరకు భయంకరంగా ప్రవర్తించిన గుర్రం అలెగ్జాండర్‌ చేతిలో చాలా శాంతంగా మారిపోయింది. ఆ బుసిఫాలస్‌ గుర్రమే అలెగ్జాండర్‌ చివరి యుద్ధం వరకు అతని ్రపాణ స్నేహితుడిగా నిలిచింది. సమస్య ఎంత పెద్దదైనా, భయపడకుండా దాని వెనుక ఉన్న అసలు కారణాన్ని గుర్తిస్తే విజయం మనదేనని ఈ బాల్య ఘట్టం మనకు నేర్పుతుంది! ఇవి కూడా చదవండి: ‘రావే చెలీ’... పాట మైకంలో చెవిటిదైపోయే పక్షి.. ఎక్కడుందో తెలుసా? హైదరాబాద్‌లో స్పోర్ట్ ఎక్స్‌పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు) 'ఇరుముడి' కావేరీ.. షూటింగ్‌లో ఎలా ఎంజాయ్ చేసిందో చూశారా? (ఫొటోలు) హైదరాబాద్ లో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) యువతకు తోడుగా నేనుంటా..! కూటమిపై రాచమల్లు అల్లుడు ఫైర్ గురు శిష్యుల చీకటి ఒప్పందంతో రాయలసీమ తాకట్టు.. శైలజానాథ్ సంచలన వ్యాఖ్యలు

Original source: sakshi.com
Read more on Kaizer News