అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందిస్తాం తొర్రూరు, ఆంధ్రప్రభ : ప్రజా ప్రభుత్వంలోనే నిరుపేదలకు న్యాయం జరుగుతుందని ఈదులకుంట తండా సర్పంచ్ బానోత్ రజిని వెంకన్న అన్నారు. శనివారం గ్రామంలో పేద కుటుంబాలకు చెందిన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రజిని మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అర్హత ఉన్న పేదలకు రేషన్ కార్డులు అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమ పాలన అందిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి వారికి అండగా నిలిచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సిద్ధార్థ రెడ్డి, గ్రామ రెవెన్యూ అధికారి జానీ, ఉప సర్పంచ్ మాలతి యాకూబ్ నాయక్, వార్డు సభ్యులు మాలోత్ వీరన్న, మాలోత్ పద్మ శీను, స్థానికులు మాలోత్ రవీందర్, మాలోతి శీను నాయక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు