Kaizer News

Vakiti Srihari | బీకేఆర్‌ ఫౌండేషన్‌ సేవలు అభినందనీ

Vakiti Srihari | బీకేఆర్‌ ఫౌండేషన్‌ సేవలు అభినందనీయం : మంత్రి వాకిటి శ్రీహరి

· Health · ntnews.com

ఊట్కూర్‌, సెప్టెంబరు 20 : సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలకు అండగా నిలుస్తున్న బీకేఆర్‌ ఫౌండేషన్‌ సేవలు అభినందనీయమని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం బీకేఆర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా హెల్త్‌ క్యాంప్‌ను మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. హైదరాబాద్‌కు చెందిన యశోద హాస్పిటల్‌ వైద్యుల బృందం సహకారంతో నిర్వహించిన ఈ శిబిరానికి వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆరు విభాగాల్లో వైద్య పరీక్షలు క్యాంప్‌లో ఎముకలు, కీళ్ల సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, సాధారణ అనారోగ్య సమస్యలు, స్త్రీల ఆరోగ్య సమస్యలు, కంటి వ్యాధులకు సంబంధించి ప్రత్యేక వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అలాగే బీపీ, షుగర్‌, కంటి పరీక్షలు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. 1500 మందికి దుప్పట్లు.. 1200 మందికి డిజిటల్‌ స్లేట్లు కార్యక్రమంలో భాగంగా 1500 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. 1200 మంది అంగన్వాడీ విద్యార్థులకు డిజిటల్‌ స్లేట్లు అందజేశారు. విద్యార్థులకు డిజిటల్‌ విద్యా వనరులు అందించడం, పేదలకు వైద్య సేవలు, అవసరమైన వస్తువులు అందించడం ద్వారా ఫౌండేషన్‌ సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోందని బాలకృష్ణారెడ్డి తెలిపారు . ఈ సందర్భంగా బీకేఆర్‌ ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రి వాకిటి శ్రీహరి కొనియాడారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో జయ చంద్రమోహన్, పీఏసీఎస్‌ చైర్మన్‌ బాల్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు సూర్యప్రకాశ్‌రెడ్డి, అరవింద్‌కుమార్‌, మణెమ్మ, సర్పంచులు రేణుక భరత్‌, సత్యనారాయణ రెడ్డి, జాఫర్, ఉపసర్పంచ్‌ రమేష్‌, నాయకులు నింగిరెడ్డి, కొండయ్య, భాస్కర్, బసవరాజ్ గౌడ్, జనార్ధన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, నారాయణ రెడ్డి, యజ్ఞేశ్వర్‌రెడ్డి, లింగం, శంకర్‌, మల్లేష్, పలువురు అధికారులు, వైద్యులు పాల్గొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News