స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని సూచన కడెం, ఆంధ్రప్రభ: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను బీజేపీ ఖానాపూర్ నియోజకవర్గ నాయకుడు అజ్మీర హరి నాయక్ కరీంనగర్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవహారాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించినట్లు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని బండి సంజయ్ సూచించినట్లు హరి నాయక్ తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరినట్లు పేర్కొన్నారు