Kaizer News

బాపు వారసత్యానికి బాపూజీ అవార్డు

బాపు వారసత్యానికి బాపూజీ అవార్డు

· State - Telangana · ntnews.com

తన తండ్రి చేపట్టిన కళకు వన్నెలద్దింది ఆ కూతురు. ఆయన వారసత్వాన్ని ఘనంగా చేపట్టింది. చిన్ననాటి నుంచి తండ్రి పడుతున్న కష్టాలకు చలించిపోయి ‘నేతన్నల జీవితం సముద్రంలోని పడవ ప్రయాణం లాంటిది’ అన్న సందేశాన్ని తివాచీపై కళాత్మకంగా అల్లింది. ఆ పనితనానికి గానూ చేనేత దినోత్సవం సందర్భంగా ‘ కొండా లక్ష్మణ్‌ బాపూజీ’ అవార్డును అందుకున్నది కంచ సమత. నిలువ నీడలేకున్నా నిలువు మగ్గంపై తివాచీలు తీర్చిదిద్దుతూ తన ప్రతిభను చాటుకుంటున్న సమత జిందగీతో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే.. మాది వరంగల్‌లోని ఉర్సు (కరీమాబాద్‌). సాధారణంగా తివాచీలు మగ్గంపై అడ్డంగా నేస్తారు. కానీ, వాటిని నిలువు మగ్గంపైన నేసేవారు అరుదుగా ఉంటారు. తెలంగాణలో మా ఒక్క కుటుంబం మాత్రమే ప్రస్తుతం నిలువు మగ్గంపై నేస్తున్నది. మా బాపు నర్సింగరావు 50 ఏండ్ల క్రితం ఆల్‌ఇండియా హ్యాండ్‌ క్రాఫ్ట్స్‌ బోర్డ్‌ వారు ఇచ్చిన శిక్షణలో ఈ కళను నేర్చుకున్నాడు. ఇక అప్పటినుంచి కుటుంబ పోషణ కోసం దీన్నే ఆధారం చేసుకున్నాడు. మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం. అందులో నేను పెద్దదాన్ని. ముగ్గురం ఆడపిల్లలమే కావడంతో ఈ కళ తనతోనే అంతరించిపోతుందని బాపు చాలాసార్లు బాధపడేవాడు. కానీ, మేము చదువుకుంటూనే మగ్గం పనిలో ఆయనకు తోడుగా నిలిచాం. బాపే మాకు గురువై ఈ కళను నేర్పించాడు. అయితే ఇందులో కొన్ని మెలుకువలు నేర్చుకునేందుకు గోల్కొండ హ్యాండ్‌ క్రాఫ్ట్స్‌ వారి దగ్గర కొన్నాళ్లు శిక్షణ తీసుకున్నాను. మరోవైపు ఇంటికి పెద్దదాన్ని కావడంతో ఇంటర్మీడియట్‌ పూర్తి చేయగానే పెండ్లి చేశారు. కారణాంతరాల వల్ల ఒంటరిగా నా ఇద్దరి పిల్లల బాగోగులు చూసుకుంటున్నాను. నా కాళ్లపై నేను నిలబడాలనే సంకల్పంతో అప్పటికే నేర్చుకున్న మగ్గం పనిని తిరిగి ప్రారంభించాను. బాపు తాను నేసే తివాచీలపై తాబేళ్లు, ఫ్లవర్స్‌ లాంటివి మాత్రమే వేసేవాడు. అందుకు భిన్నంగా ఈ తరానికి నచ్చే ఆకృతులను అందులో ప్రతిబింబించాలని నా ప్రయత్నాన్ని కొత్తగా మొదలుపెట్టాను. అందులో భాగంగానే గోడలపై వేసే పెయింటింగ్‌ బొమ్మలను, పర్వదినాలు, ప్రత్యేక రోజులప్పుడు శుభాకాంక్షలను తెలిపే వివిధ ఆకృతులను తివాచీలపై నేయడం మొదలుపెట్టాను. పదేండ్ల క్రితమే ఈ రంగంలోకి పూర్తిస్థాయిలో దిగినా.. నాకంటూ ఓ గుర్తింపు వచ్చింది మాత్రం 2024లోనే. చీకటి నుంచి వెలుగుల వైపు నా ప్రయాణం సాగుతుందనే కోణంలో ‘నీలాకాశంలో చుక్కలు మెరుస్తున్నట్టుగా’ తివాచీని నేశాను. దానికి గోల్కొండ హ్యాండ్‌ క్రాఫ్ట్స్‌ వాళ్లు రాష్ట్రస్థాయి అవార్డును అందించారు. ఆ గుర్తింపు నా జీవితంలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. అప్పటివరకు నేను తయారు చేసిన తివాచీలు అంతగా అమ్ముడయ్యేవి కావు. దాంతో ఎప్పుడూ కష్టాలే ఉండేవి. ఆ అవార్డుతో నేను నేసే తివాచీలకు డిమాండ్‌ పెరిగింది. కొనుగోలుదారులు అడ్రస్‌ తెలుసుకొని మరీ నా దగ్గరికి వచ్చేవారు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్న నాకు ఒక ఆసరా దొరికినట్టయింది. అలా నెమ్మదిగా నా కుటీర పరిశ్రమ వృద్ధిలోకి వచ్చింది. చిన్నప్పటినుంచి మాది పేద కుటుంబమే అయినా నాన్న మమ్మల్ని చదివించాడు. ఆ చదువు విలువ తెలిసిన నేను నా కష్టాలను పాఠాలుగా చెప్పడం మొదలు పెట్టాను. ఓ వైపు చేనేత పనులు చే

Original source: ntnews.com
Read more on Kaizer News