Kaizer News

Prakasam: 30 ఏళ్ల కల సాకారం: రేపు వెలిగొండ ప్రాజెక

Prakasam: 30 ఏళ్ల కల సాకారం: రేపు వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం!

· State - Telangana · hmtvlive.com

ప్రకాశం: మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ కల సాకారం కాబోతోంది. మార్కాపురం జిల్లా గడ్డపై రేపు కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నల్లమల కొండలను చీల్చుకుంటూ నల్లమల సాగర్‌లోకి కృష్ణమ్మ జలాలు పరుగులు పెట్టనున్నాయని, దశాబ్దాలుగా కరవుతో అల్లాడుతున్న పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించనుందని సీఎం తెలిపారు. కరవు పీడిత పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించాలనే లక్ష్యంతో 1996లో ప్రారంభమైన వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను పూర్తి చేసి ప్రారంభించే అవకాశం రావడం తనకు ఎంతో సంతోషాన్ని, భావోద్వేగాన్ని కలిగిస్తోందని చంద్రబాబు అన్నారు. దాదాపు 30 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తున్న రైతులు, ప్రజల కల ఇప్పుడు కళ్లముందు నిజం కానుందని పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు కేవలం ఒక సాగునీటి ప్రాజెక్టు కాదని సీఎం అభివర్ణించారు. కరవుతో పోరాడుతున్న రైతన్నకు ఇది భరోసా అని, ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న కుటుంబాలకు ఆరోగ్య భద్రతను అందించే ప్రాజెక్టు అని తెలిపారు. నీటి కోసం వలస వెళ్లిన యువతకు సొంత ప్రాంతంలోనే ఉపాధి, భవిష్యత్తుకు బాటలు వేస్తుందని పేర్కొన్నారు. దశాబ్దాలుగా వెనుకబడిన ప్రాంతానికి వెలిగొండ ప్రాజెక్టు అభివృద్ధికి కొత్త మార్గాన్ని చూపనుందని చెప్పారు. వెలిగొండ తొలి దశ ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు 4 లక్షల మందికి తాగునీరు అందనున్నట్లు సీఎం తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో వ్యవసాయ రంగానికి కొత్త ఊపొస్తుందని, తాగునీటి సమస్యలు గణనీయంగా తగ్గుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. సాగునీటి లభ్యతతో రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు, స్థానికంగా ఆర్థిక కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ మహాయజ్ఞం వెనుక నిర్వాసితుల త్యాగం ఉందని చంద్రబాబు గుర్తుచేశారు. ప్రాజెక్టు కోసం తమ భూములు, ఇళ్లు, పుట్టిపెరిగిన గ్రామాలను త్యాగం చేసిన 11 గ్రామాల నిర్వాసితులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఆయన అన్నారు. వారి త్యాగాలను ప్రభుత్వం ఎప్పటికీ మరచిపోదని స్పష్టం చేశారు. నల్లమల కొండలను చీల్చుకుంటూ నల్లమల సాగర్‌లోకి కృష్ణమ్మ జలాలు ప్రవహించనుండటం ఈ ప్రాంత ప్రజలకు కీలక పరిణామంగా మారనుంది. తరతరాలుగా నీటి కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు వెలిగొండ కొత్త ఆశలను తీసుకురానుంది. సాగునీరు అందుబాటులోకి రావడంతో కరవు ప్రాంతం పచ్చని పొలాలతో కళకళలాడే రోజులు వస్తాయని రైతులు ఆశిస్తున్నారు. “రేపటి నుంచి మొదలయ్యే వెలిగొండ జలసిరులు... అభివృద్ధికి రెక్కలు” అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని ఒక పండుగలా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ చారిత్రక ఘట్టానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని సీఎం పిలుపునిచ్చారు. “రేపు వెలిగొండ పండుగ దగ్గర కలుద్దాం” అంటూ ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు చేసిన పిలుపుతో పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో ఉత్సాహం నెలకొంది. మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరదించి.. లక్షలాది మంది ప్రజల భవిష్యత్తుకు కొత్త నీటి బాటలు వేస్తూ వెలిగొండ ప్రాజెక్టు చరిత్రలో

Original source: hmtvlive.com
Read more on Kaizer News