Kaizer News

భూస్వాముల ఆక్రమణలో అల్లంవారి కుంట?.. 24 ఎకరాల నుంచ

భూస్వాముల ఆక్రమణలో అల్లంవారి కుంట?.. 24 ఎకరాల నుంచి ఒక్క ఎకరానికి కుదింపు!

· State - Telangana · prabhanews.com

ఒకప్పుడు నిండా నీటితో కళకళలాడిన కుంట.. ఇప్పుడు సాగు భూముల మధ్య మిగిలిన నీటి జాడ రెవెన్యూ, నీటిపారుదల శాఖల సంయుక్త సర్వే.. ఎఫ్‌టీఎల్‌ స్థాయిపై నివేదికకు ఏర్పాట్లు జన్నారం, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రేండ్లగూడ సమీపంలోని అల్లంవారి కుంట పరిస్థితి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు 24 ఎకరాల విస్తీర్ణంలో నిండా నీటితో కళకళలాడిన ఈ కుంట ఇప్పుడు కేవలం ఒక ఎకరంలో నీరు నిల్వ ఉండే స్థాయికి కుదించుకుపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామ రెవెన్యూ శివారులోని 160, 161 సర్వే నంబర్లలో ఉన్న ఈ కుంటకు సుమారు 24 ఎకరాల నీటి నిల్వ విస్తీర్ణం ఉందని చెబుతున్నారు. గతంలో ఈ కుంట నీటితో సుమారు 65 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేదని రైతులు గుర్తు చేస్తున్నారు. కుంట ముంపు భూమిలోని సుమారు 23 ఎకరాలను కొందరు ఆక్రమించి సాగు చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ భూమికి మార్కెట్ లో సుమారు రూ.5 కోట్ల ధర పలుకుతున్నట్లు సమాచారం. అల్లం, బాల్త, సుద్దపెల్లి ఇంటి పేర్లు కలిగిన కొందరు భూస్వాములతో పాటు మరికొందరు కుంట భూమిని ఆక్రమించి పంటలు సాగు చేస్తూ ఆర్థిక లాభాలు పొందుతున్నారని స్థానిక రైతులు ఆరోపించారు. ప్రస్తుతం కుంట విస్తీర్ణం భారీగా తగ్గిపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం పడిపోయిందని, గతంలో సాగునీరు అందిన ప్రాంతాలకు ఇప్పుడు సరిపడా నీరు అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత భూస్వాముల స్పందన తెలియాల్సి ఉంది. ఈ వ్యవహారంపై సీపీఐ మండల కన్వీనర్ దాసరి తిరుపతి, రైతులు బాల్త సుధాకర్, ఆకుల సత్యవ్వ, ఆకుల మధు, అల్లం సాంబయ్య, పెద్దన్న, సురేష్, అల్లం గిరి వర్మ, వేయికండ్ల రవి, ఎస్. పవన్ యాదవ్ తదితరులు పలుమార్లు ఆందోళనలు నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయింపులు, రాస్తారోకోలు చేపట్టి జిల్లా కలెక్టర్, నీటిపారుదల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేశారు. గ్రామవాసి, సామాజిక సేవకుడు సముద్రాల శంకర్ కూడా ఈ సమస్యపై అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు మండల కేంద్రం నుంచి మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేసి కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 21న జన్నారం నీటిపారుదల శాఖ డిప్యూటీ ఈఈ వెంకటేశం, ఏఈఈ శ్రవణ్, మండల సర్వేయర్ ఎంబడి దినేష్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ దుర్గం వెంకటేశం, వర్క్ ఇన్‌స్పెక్టర్ మామిడి శంకర్, ఏఎస్సై ఉమేష్ కుమార్, జీపీఓ కమలాకర్ తదితరులు కుంట ముంపు ప్రాంతంలో సంయుక్త సర్వే నిర్వహించారు. సర్వే అనంతరం స్థానిక తహసీల్దార్ బక్కయ్య మాట్లాడుతూ వారంలోగా రెవెన్యూ రికార్డులు, పూర్వాపరాలను పరిశీలించి, సర్వే ఆధారంగా కుంట పూర్తి నీటి నిల్వ స్థాయి నివేదికను సిద్ధం చేసి జిల్లా కలెక్టర్‌కు పంపిస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఈ భూమి రెవెన్యూ రికార్డుల్లో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఒకరి పేరుపై ఉండేదని, అనంతరం సీలింగ్ నిబంధనల కింద ప్రభుత్వానికి అప్పగించినట్లు స్థానికంగా సమాచారం ఉందని చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి రికార్డులను అధికారులు పరిశీలించాల్సి ఉంది. ప్రస్తుతం రెవెన్యూ నక్షాల

Original source: prabhanews.com
Read more on Kaizer News