పల్లవి సుధీర్ మెడికేర్ హాస్పిటల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు భీమవరం, ఆంధ్రప్రభ: భీమవరం పట్టణంలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం డీఎన్నార్ కళాశాల రోడ్డులో ఏర్పాటు చేసిన పల్లవి సుధీర్ మెడికేర్ హాస్పిటల్‌ను ఆదివారం ఎమ్మెల్యే అంజిబాబు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భీమవరం పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతోందని, అత్యాధునిక వైద్య పరికరాలతో సేవలు అందించే ఆస్పత్రులు రావడం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ నడింపల్లి సుదీర్‌వర్మ, డాక్టర్ పల్లవి జంపన మాట్లాడుతూ.. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, 24 గంటల అత్యవసర వైద్య సేవలు, ఐయూఐ, ఐవీఎఫ్, ఐసీఎస్‌ఐ, జనరల్ సర్జరీ తదితర వైద్య సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ వైద్యులు, ప్రముఖులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు