Kaizer News

Kanipakam: సిద్ధి, బుద్ధి సమేతుడై భక్తులను అనుగ్రహ

Kanipakam: సిద్ధి, బుద్ధి సమేతుడై భక్తులను అనుగ్రహించిన వినాయకుడు!

· State - Telangana · hmtvlive.com

Shorts Kanipakam: స్వామివారిని ఆలయ కళ్యాణ మండపము నందు స్వామివారికి సుగంధ పుష్పాలతో, కర్పూర హారతులతో విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని పల్లకిలో తీసుకువచ్చి చిలుక వాహనంపై ఆశీనులను చేశారు. కాణిపాక వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు ఉదయం స్వామివారు సిద్ధి బుద్ధి సమేతుడై చిలక వాహనంపై భక్తులకు నయానందకరముగా, కరముగా కన్నుల పండుగగా దర్శనమిచ్చారు. చిలక వాహనంపై ఆసీనులైన గణనాథుడికి మనోహరముగా, సుందరముగా, అత్యంత వైభవముగా అలంకరించి ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి భక్తులకు హారతులు ఇచ్చారు. చిలక వాహనంపై ఊరేగుతున్న స్వామి వారిని దర్శించుకుంటే ఉన్నతమైన విద్య,విజ్ఞానము, ఆరోగ్యము, తేజస్సు, వాక్ శుద్ధి, భక్తులకు అనుగ్రహిస్తారని పురాణాలలో చెప్పబడిందని ఆలయ అర్చకులు తెలిపారు. చిలుక వాహన సేవకు ఆర్యవైశ్య సంఘము వారు ఉభయ దారులుగా వ్యవహరించారు. చిలుక వాహన సేవ కార్యక్రమములో ఆలయ ఈవో పెంచల కిషోర్ ,ఆలయ చైర్మన్ మని నాయుడు, అర్చకులు, పోలీసు సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News