Kaizer News

తిమ్మాపూర్‌లో ఏటీఎం చోరీ.. గ్యాస్ కట్టర్‌తో ధ్వంసం

తిమ్మాపూర్‌లో ఏటీఎం చోరీ.. గ్యాస్ కట్టర్‌తో ధ్వంసం

· State - Telangana · prabhanews.com

ఒకే రాత్రి రెండు చోట్ల ఏటీఎం చోరీలు.. కరీంనగర్ క్రైం, ఆంధ్రప్రభ: కరీంనగర్ జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో శనివారం అర్ధరాత్రి వరుస ఏటీఎం చోరీలు కలకలం రేపాయి. దుర్షెడ్‌ గ్రామంతో పాటు తిమ్మాపూర్‌ బస్‌స్టాప్‌ ప్రాంతంలోని ఎస్బీఐ ఏటీఎంలోనూ దుండగులు చోరీకి పాల్పడినట్లు సమాచారం. స్కార్పియో వాహనంలో వచ్చిన దుండగులు గ్యాస్‌ కట్టర్‌ సాయంతో ఏటీఎంను ధ్వంసం చేసి అందులోని నగదును ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే తిమ్మాపూర్‌ ఏటీఎంలో ఎంత మొత్తంలో నగదు చోరీకి గురైందన్నది బ్యాంకు అధికారులు వెల్లడించాల్సి ఉంది. వరుస చోరీలపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాలను పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. దుండగులు ఉపయోగించిన స్కార్పియో వాహనం ఆధారంగా వారి ఆచూకీ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకే తరహాలో రెండు చోట్ల ఏటీఎంలను ధ్వంసం చేసి చోరీలకు పాల్పడటంతో నిందితులను పోలీసులు ఎంత త్వరగా పట్టుకుంటారన్నది ఆసక్తిగా మారింది. ఇదే తరహాలో మంచిర్యాల జిల్లాలోనూ ఏటీఎం చోరీ జరగడం గమనార్హం. ఆయా ఘటనలకు సంబంధం ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం

Original source: prabhanews.com
Read more on Kaizer News