Shorts పిఠాపురం: పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్రాడ బ్రిడ్జి కింద ఈరోజు ఒక గుర్తుతెలియని మగ వ్యక్తి, సుమారు 25 సంవత్సరాల వయస్సు, కరెంట్ పోల్‌కు ఉరివేసుకుని మృతి చెందిన స్థితిలో గుర్తించబడినాడు. 1. కుడి చేతి పైభాగంలో “అమ్మ” అనే తెలుగు అక్షరాలతో పచ్చబొట్టు (టాటూ) ఉంది. 2. ఎడమ చేతికి నలుపు రంగు బ్యాండ్ ధరించి ఉన్నాడు. మృతుడి వద్ద ప్రస్తుతానికి ఎటువంటి గుర్తింపు వివరాలు లభించలేదు. మృతుడి గుర్తింపు మరియు కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. పై లక్షణాలతో ఉన్న వ్యక్తి ఎవరైనా తప్పిపోయినట్లు తెలిసినట్లయితే లేదా మృతుడిని గుర్తించగలిగే వారు ఎవరైనా ఉంటే, వెంటనే పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ను సంప్రదించవలసిందిగా కోరడమైనది