Kaizer News

కడెం 108 సిబ్బందికి ‘లైఫ్ సేవ్‌’ అవార్డు

కడెం 108 సిబ్బందికి ‘లైఫ్ సేవ్‌’ అవార్డు

· State - Telangana · prabhanews.com

కడెం, ఆంధ్రప్రభ : సమయస్ఫూర్తితో వ్యవహరించి, అత్యవసర పరిస్థితిలో ఉన్న బాధితుడికి తక్షణ వైద్యసేవలందించి ప్రాణాలు కాపాడిన కడెం 108 అంబులెన్స్ సిబ్బంది ప్రతిష్టాత్మక ‘లైఫ్ సేవ్‌’ అవార్డును అందుకున్నారు. ఈ నెల 18 నిర్మల్ జిల్లా కేంద్రంలోని 108 ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ జనార్దన్, జిల్లా ఇన్‌ఛార్జ్ లింగాచారితో కలిసి ఈ పురస్కారాన్ని అందజేశారు. ఇటీవల నమోదైన ఒక అత్యవసర (బెస్ట్ కేసు) కేరులో కడెం అంబులెన్స్‌కు చెందిన ఈఎంటీ మురళీ మోహన్, పైలట్ వసంత్ అత్యంత ప్రతిభను కనబరిచారు. క్లిష్ట సమయంలో బాధితుడికి అవసరమైన ప్రాథమిక వైద్యం అందిస్తూ, సురక్షితంగా ఆస్ప‌త్రికి తరలించి ప్రాణదాతలుగా నిలిచారు. వీరి సేవలను గుర్తించిన యాజమాన్యం ‘లైఫ్ సేవ్‌’ అవార్డుతో సత్కరించింది. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ మేనేజర్ జనార్దన్ మాట్లాడుతూ.. కడెం 108 సిబ్బంది చూపిన చొరవ, వృత్తి పట్ల వారికున్న అంకితభావం తోటి సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. జిల్లా ఇన్‌ఛార్జ్ లింగాచారి మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజల ప్రాణాలను కాపాడాలని సూచించారు. ఈఎంటీ మురళీ మోహన్, పైలట్ వసంత్‌ను తోటి సిబ్బంది, స్థానికులు ప్రత్యేకంగా అభినందించారు

Original source: prabhanews.com
Read more on Kaizer News