Kaizer News

రేపు పులివెందులకు వైఎస్‌ జగన్‌

రేపు పులివెందులకు వైఎస్‌ జగన్‌

· State - Telangana · sakshi.com

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రేపటి(మంగళవారం) నుంచి పులివెందులలో పర్యటించనున్నారు. సెప్టెంబర్‌ 2న ఇడుపులపాయలో జరిగే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించనున్నారు. 01.09.2026 షెడ్యూల్‌ ఇలా.. వైఎస్‌ జగన్‌ సెప్టెంబర్‌ 1న(మంగళవారం) మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల చేరుకుంటారు. అనంతరం భాకరాపురంలోని క్యాంప్‌ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. రాత్రికి పులివెందులలోని తన నివాసంలో బస చేస్తారు. 02.09.2026 షెడ్యూల్‌.. సెప్టెంబర్‌ 2న ఉదయం పులివెందుల నివాసం నుంచి బయలుదేరి ఉదయం 7.45 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం వైఎస్‌ జగన్‌ అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. చదవండి: తానే శంకుస్థాపన చేసి, తానే పూర్తి చేసినట్టు బాబు అబద్ధాలు.. వెలిగొండలో క్రెడిట్‌ చోరీ ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు) వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ! Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05) కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు) వెలిగొండ లెక్కలు బయటపెట్టే దమ్ముందా.. శ్రీకాంత్ రెడ్డి సంచలన కామెంట్స్

Original source: sakshi.com
Read more on Kaizer News