Kaizer News

‘మజ్లిస్‌’ లోనూ సంస్థాగత ప్రక్షాళన !

‘మజ్లిస్‌’ లోనూ సంస్థాగత ప్రక్షాళన !

· State - Telangana · prabhanews.com

వ్యక్తిగత క్రమశిక్షణ గల నేతలకే ప్రముఖంగా స్థానం తాజా ఘటనతో అన్ని అంశాలపై విచారణకు అధినేత ఆదేశం ఎమ్మెల్సీ దుశ్చర్య ప్రకంపణలతో చర్యలకు ఉపక్రమించిన అధిష్టానం భూ కబ్జా ఆరోపణలు, రౌడీయిజం, అక్రమాలపై అంతర్గతంగా నేతలపై కొరడా గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల నేపథ్యంలో పార్టీ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి పార్టీపై మచ్చను తుడిపేయడంతో పాటు స్వచ్ఛమైన నాయకులనే బరిలోకి దింపే వ్యూహం హైదరాబాద్‌, ఆంధ్రప్రభ పొలిటికల్‌ బ్యూరో : హైదరాబాద్‌ పాతనగరంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన ఆల్‌ ఇండియా మజ్లిస్‌ ఏ-ఇత్తేహదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) సంస్థాగత బలోపేతం దిశగా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడల్లా దేశవ్యాప్తంగా అక్కడక్కడ పోటీ చేస్తూ తమ ప్రాబవాన్ని చాటుకుంటూ వస్తున్న ఆ పార్టీ ఇన్నాళ్లూ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచింది. నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఏస్థాయి వ్యక్తులైనా పార్టీ నిబంధనలకు కట్టుబడి పనిచేయాలన్నది అక్కడ ఖచ్చితంగా అమలవుతుందన్నది సుస్పష్టం. ఎమ్‌ల్యేలు, కార్పొరేటర్లు ప్రతిరోజూ ఉదయం 10.30 గంటలకు తమ పార్టీ కార్యాలయమైన ‘దారూసలాం’కు వెళ్లి సంతకాలు చేశాకే ఇతర షెడ్యూల్‌ కార్యక్రమాల్లో పాల్గొనాలన్న నిబంధన నేటికీ అమల్లోనే ఉంది. ప్రజల నుంచి అక్కడికి వచ్చే అర్జీలను పరిష్కరించేందుకు బ్యాంకింగ్‌ సెక్టార్‌ తరహాలో ఉద్యోగులు కూడా పనిచేస్తారు. ఫిర్యాదులు, సమస్యల పరిష్కారంతో పాటు ఆ విషయాన్ని తిరిగి సదరు వ్యక్తులకు తెలియపరుచడం లాంటి నిబద్ధత గల వ్యవస్థ మరెక్కడా లేదనడంలో సందేహం లేదు. కానీ, తాజా కొంతమంది నాయకుల తీరుతో పరిణామాలు పార్టీ గీత దాటుతున్నట్లుగా గుర్తించి దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు. రాజధాని నగరంలో గడిచిన కొన్ని దశాబ్ధాలుగా ఖచ్చితమైన సంఖ్యబలంతో ఎమ్మెల్యేలను గెలిపించుకుంటున్న ఆ పార్టీ అధినేత, హైదరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు అసదుద్ధీన్‌ ఓవైసీ తమ స్థానాలను సుస్థిరపరుచుకునే దిశగా చర్యలు మొదలుపెట్టారు. మునుపెన్నడూ లేనివిధంగా ‘మజ్లిస్‌’లో సంస్థాగత ప్రక్షాళనకు ఆదేశించారు. ఇకపై వ్యక్తిగత క్రమశిక్షణ గల నేతలకే పార్టీలో, ఇతర పదవుల్లో ప్రముఖంగా స్థానం కల్పించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ వ్యవహారం, తాజా ఘటనతో అన్ని అంశాలపై విచారణకు అధినేత ఆదేశించడం చర్చనీయాంశంగా మారుతోంది. ఎమ్మెల్సీ దుశ్చర్య ప్రకంపణలతో అధిష్టానం చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. భూ కబ్జా ఆరోపణలు, రౌడీయిజం, అక్రమాలపై అంతర్గతంగా నేతలపై కొరడా ఝులిపించనున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల నేపథ్యంలో పార్టీ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చెబుతున్నారు. పార్టీపై మచ్చను తుడిపేయడంతో పాటు స్వచ్ఛమైన నాయకులనే బరిలోకి దింపే వ్యూహంగా కనిపిస్తోంది. నగరంలోని పాతబస్తీలో పాగా వేసేందుకు మజ్లిస్‌-బచావో-తహరిక్‌ (ఎంబీటీ) పార్టీని అధిగమించేందుకు వ్యూహత్మకంగా అడుగులేసి మజ్లిస్‌ పార్టీ పైచేయి సాధించింది. రాజకీయ శత్రుపక్షమైన నేత వ్యూహాన్ని తిప్పికొట్టి మట్టి కరిపించడమే లక్ష్యంగా శక్తియుక్తులను ఒడ్డి చివరకు ఆల్‌

Original source: prabhanews.com
Read more on Kaizer News