పాలమూరు రైతాంగానికి సాగునీరు, ఉచిత విద్యుత్ అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు (కేటీఆర్) తీవ్రస్థాయిలో విమర్శించారు. వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలోని సబ్ స్టేషన్ నుంచి సుభాష్ చౌరస్తా వరకు నిర్వహించిన భారీ నిరసన ర్యాలీలో మాజీంత్రులు నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం మళ్లీ పాతరోజుల నాటి విద్యుత్, నీటి […]