చౌటుప్పల్, ఆంధ్రప్రభ: హైదరాబాద్ శంషాబాద్‌లోని జీఎంఆర్ అరేనాలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి–రజిత దంపతుల ద్వితీయ కుమారుడు చలమల్ల వినీత్‌రెడ్డి, లిపిరెడ్డిల వివాహ మహోత్సవం శాస్త్రోక్తంగా, వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వివాహ వేడుకలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, మిత్రులు, బంధువులు పెద్ద ఎత్తున హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు