Kaizer News

Sathupalli: లంకపల్లి ప్రభుత్వ పాఠశాలలో నోట్‌బుక్స్

Sathupalli: లంకపల్లి ప్రభుత్వ పాఠశాలలో నోట్‌బుక్స్ పంపిణీ!

· State - Telangana · hmtvlive.com

Shorts Sathupalli: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్దారం రోడ్ నందు గల స్వర్ణిక దివ్యాంగుల సేవా ఆశ్రమం ఆధ్వర్యంలో పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలో ప్రైమరీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సత్తుపల్లి బోనగిరి సాంబశివరావు అడ్వకేట్ గారి ప్రోత్సాహంతో లంకపల్లి గ్రామస్థులు శ్రీ అంబోజు నాగేశ్వరరావు కుమారుడు శ్రీ అంబోజు అభిషేక్ నందన్ పుట్టిన రోజు సందర్భంగా నోట్ బుక్స్ మరియు పెన్నులు పంపిణీ చేయుటకు ఆర్ధిక సాయం చెయ్యడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు కృష్ణవేణి గారు మాట్లాడుతూ తమ పాఠశాలకు ఇంతవరకు ఎవరు ఈ విధంగా సాయం చెయ్యలేదు అని పేద పిల్లల్ని ప్రోస్తహించుటకు వికలత్వంతో ఉండి తమ బాధలను లెక్క చెయ్యకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు చెయ్యడం చాలా గొప్ప విషయం, పేద పిల్లలకు నోట్ బుక్స్ మరియు పెన్నులు ఇవ్వటం వారు చదువుకొనుటకు మంచి ఆలోచన చేశారు అని వలపర్ల రవికుమార్ నీ అభినందిస్తూ స్వర్ణిక దివ్యాంగుల సేవా ఆశ్రమానికి తమ పాఠశాల తరుపున 2000 రూ. ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News