Kaizer News

Markapur: గ్రామాల ప్రజలకు సెప్టెంబర్ 1 నుంచి ప్రత్

Markapur: గ్రామాల ప్రజలకు సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యేక కేంద్రాల ద్వారా రేషన్ పంపిణీ

· State - Telangana · hmtvlive.com

వెలిగొండ: వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల సౌకర్యార్థం సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యేక పంపిణీ కేంద్రాల ద్వారా రేషన్ బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు. పెద్దారవీడు మండలంలోని కలనూతల, సుంకేసుల, గుండంచర్లతో పాటు మార్కాపురం మండలంలోని గొట్టిపడియా గ్రామాల రేషన్ కార్డుదారులకు ఈ సౌకర్యం కల్పించారు. కలనూతల, గుండంచర్ల గ్రామాలకు దేవరాజుగట్టు, గొట్టిపడియాకు ఇందిరమ్మ కాలనీ, సుంకేసులకు గోగులదిన్నె కమ్యూనిటీ హాల్‌లో ప్రత్యేక రేషన్ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అర్హులైన రేషన్ కార్డుదారులు తమకు కేటాయించిన కేంద్రాల్లో రేషన్ సరుకులు పొందాలని అధికారులు సూచించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News