Kaizer News

బాల్య వివాహం నిలిపివేత

· State - Telangana · sakshi.com

రంగంపేట: మండలంలోని ఈలకొలను గ్రామంలో 17 బాలికకు వివాహం చేసేందుకు జరుగుతున్న ఏర్పాట్లను ఐసీడీఎస్‌, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ అధికారులు అడ్డుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈలకొలను గ్రామానికి చెందిన అంచూరి నాగేశ్వరరావు, లక్ష్మి దంపతుల 17 ఏళ్ల కుమార్తెకు అదే గ్రామానికి చెందిన కురుకూరి గవర్రాజు, మంగ దంపతుల కుమారుడు దుర్గాప్రసాద్‌తో శుక్రవారం రాత్రి వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆ స మయానికి చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారి ఎం. నరేష్‌ బాబు, వీఆర్వో భాస్కరరావు తదితరులు వెళ్లి వివాహాన్ని నిలిపివేశారు. అనంతరం శనివారం ఉదయం ఐసీడీఎస్‌ రంగంపేట ప్రాజెక్టు అధికారి కె. కష్ణవేణి ఆధ్వర్యంలో సెక్టర్‌ సూపర్‌వైజర్‌ ఆర్‌.నందీశ్వరి, వీఆర్వో పి.భాస్కరరావు, కార్యదర్శి ఎంఎస్‌కే శ్రీలక్ష్మి, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ కార్యకర్తలు గ్రామానికి చేరుకుని బాలిక, బాలుడి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. బాలికకు 18 దాటకుండా వివాహం చేస్తే ఎదురయ్యే శారీరక, సామాజిక సమస్యలను వివరించి నిర్ణీత వయసులోపు వివాహం చేయబోమని అంగీకార పత్రం తీసుకున్నారు. బాల్య వివాహాల సమాచారం తెలిసిన వెంటనే చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098కు సమాచారం అందించాలని, బాలల భద్రత విషయంలో ప్రజలు అ ప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. యలమంచిలి: అప్పుల ఊబిలో చిక్కుకుని తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన దొడ్డా సాయికృష్ణ, శిరీష దంపతులు చించినాడ వద్ద వశిష్ట గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. వారి కోసం పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు విస్తృతంగా గాలించగా సాయికృష్ణ మృతదేహం అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి వద్ద శనివారం లభ్యమైంది. మృతదేహాన్ని చించినాడ తీసుకువచ్చి శవ పంచనామా నిర్వహించిన అనంతరం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సాయికృష్ణ భార్య శిరీష కోసం గాలిస్తున్నట్లు ఎస్సై మోటూరి రాజ్‌కుమార్‌ తెలిపారు. సాయికృష్ణ మృతదేహాన్ని పాలకొల్లు ప్రభుత్వాసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు ఆయన వివరించారు. ● నిర్ణీత వయసు లోపు వివాహం చేయబోమని అంగీకారపత్రం స్వీకరణ ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు) 11 కిలోలు పెరిగా.. నా Babyకి మీరే పేరు పెట్టాలి.. ప్రెగ్నెన్సీపై సామ్ రియాక్షన్ నేపాల్ లో టెన్నన్ టెన్సన్.. కృత్రిమ సరస్సు బద్దలైతే మరో ప్రళయమే నవంబర్ లో పెళ్లి.. పాత కక్షలే ప్రాణం తీశాయా..? మనుగూరులో గ్యాంగ్ వార్ కలకలం

Original source: sakshi.com
Read more on Kaizer News